Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 11:17 pm IST

Menu &Sections

Search

డ్రైవింగ్ లైసెన్సులో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ర‌వాణ‌శాఖ‌...ఇక ఆ క‌ష్టాలు ఉండ‌వు

డ్రైవింగ్ లైసెన్సులో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ర‌వాణ‌శాఖ‌...ఇక ఆ క‌ష్టాలు ఉండ‌వు
డ్రైవింగ్ లైసెన్సులో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ర‌వాణ‌శాఖ‌...ఇక ఆ క‌ష్టాలు ఉండ‌వు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సామాన్యుల‌కు డ్రైవింగ్ లైసెన్స్ క‌ష్టాలు తీర‌నున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల ఫ‌లితంగా గ‌తంలో చుక్క‌లు చూపించిన అంశాలు ఇప్పుడు తీరే అవ‌కాశం ఉన్నాయి. గ‌తంలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్సీ కార్డులంటే ల‌క్ష తొంబై త‌ప్పులుండేవి. మ‌న వివ‌రాలు ఒక‌టైతే...అందులో ఉండేవి మ‌రొక‌టి ఉండేవి. అయితే ఆ చిత్రాల‌కు ఇక చెక్ ప‌డ‌నుంది. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల‌ను ప్రింటింగ్‌కు పంపించేముందు.. దరఖాస్తుదారులకు వాటి ప్రతులను వాట్సాప్, మెయిల్స్ ద్వారా పంపాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ప్రింటింగ్ సమయంలో తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 


ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నట్టు రవాణాశాఖ జాయింట్ కమిషనర్, ఆన్‌లైన్ సర్వీసెస్ సిటిజన్స్ కమిటీ చైర్మన్ రమేశ్ తెలిపారు. శనివారం ట్రాన్స్‌పోర్టుభవన్‌లో రమేశ్ అధ్యక్షతన సమావేశమైన ఆన్‌లైన్ సర్వీసెస్ సిటిజన్స్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకొంది. ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటుచేశామని.. రవాణాశాఖ అందించే సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొంటామని రమేశ్ చెప్పారు. పెండింగ్‌కార్డులను సోమవారం నుంచి పంపిణీచేస్తామన్నారు. 


ఇదిలాఉండ‌గా, కేంద్ర ప్ర‌భుత్వం సైతం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దేశవ్యాప్తంగా వ‌చ్చే నెల నుంచి ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానం అమల్లోకి తెచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ మేరకు సరికొత్త డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్సీ) జారీచేయనున్నారు. కొత్తగా జారీచేసే స్మార్ట్ కార్డులపై మైక్రోచిప్, క్యూఆర్ కోడ్‌లను ముద్రించనున్నారు. కార్డు వివరాల్ని వేగంగా గుర్తించడానికి వీటిలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారు. అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే సెక్యూరిటీ ఫీచర్లతో ఈ సరికొత్త డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు ప్రవేశపెట్టనున్నారు. ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ పేరుతో దీన్ని జారీ చేస్తారు. వాహన డ్రైవర్ పేరు, బ్లడ్ గ్రూప్, అవయవదానం చేస్తామంటూ ఇచ్చే డిక్లరేషన్ వివరాల్ని కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌పై పొందుపరుస్తారు. ఒకవేళ దివ్యాంగులైతే వారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాహనం ఉంటే ఆ వివరాల్ని కార్డుపై ముద్రిస్తారు.


దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 32వేల కొత్త డ్రైవింగ్ లైసెన్సులు(నెలకు సుమారు 9.6 లక్షలు) జారీ లేదా రెన్యువల్ చేస్తున్నారు. అలాగే నిత్యం 43వేల వాహనాలు(నెలకు సుమారు 13 లక్షలు) కొత్తగా రిజిస్టర్ లేదంటే రీ-రిజిస్టర్ అవుతున్నాయి. వీరందరికీ కొత్తగా ప్రవేశపెట్టే లైసెన్సులు, ఆర్సీలను రవాణాశాఖ జారీచేయనున్నది. ఈ స్మార్ట్ కార్డుల ప్రక్రియ నిరంతరం సాగుతుందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. ఈ కొత్త కార్డుల ధర 15 నుంచి 20 రూపాయలకు మించకపోవచ్చని ఆయన వెల్లడించారు. 


driving-license
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిదంబ‌రం అరెస్ట్‌...రాత్రంతా అక్క‌డే
చిదంబరానికి తెలుగు జ‌డ్జీ షాక్‌...అరెస్ట్ త‌ప్ప‌దు
కృత్రిమ అడ‌విలో....క‌లెక్ట‌ర్ల‌కు కొత్త ప్ర‌పంచం చూపించిన సీఎం కేసీఆర్..!
చిదంబ‌రం చేతికి బేడీలు...ఏక్ష‌ణ‌మైనా...
బ‌య‌ట నోరు తెర‌వ‌ద్దు...మీటింగ్ ముచ్చ‌ట్లు చెప్ప‌ద్దు..కేసీఆర్ ఆర్డ‌ర్‌
వైద్య‌సేవ‌ల‌కు ఓకే...ఆరోగ్య‌శ్రీ‌తో ఆగిపోయిన సేవ‌లు పునఃప్రారంభః
మోడీ స్కెచ్ స‌క్సెస్‌..ఇమ్రాన్ ఖాన్ త‌లంటిన ట్రంప్‌
బొత్సాతో ఆ మాట‌ల‌ను చెప్పించింది జ‌గ‌నే క‌దా?
మ‌రో వివాదంలో కంగ‌నా..చీర‌తో ఆమె మొద‌లుపెట్టింది మ‌రి
అమ్మాయిల‌ను అనుభ‌వించాడు...4000 కోట్ల ఆస్తి దానం..ఆఖ‌రికి ఎలా మ‌ర‌ణించాడంటే
చంద్ర‌యాన్ 2 ...సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన ఇస్రో
అసెంబ్లీ ఫ‌ర్నీచ‌ర్ మాయం...కోడెల ఇంటికి చేరింద‌ట‌
చంద్రుడి క‌క్ష్య‌లోకి చంద్ర‌యాన్‌...ఇక మిగిలింది ఏంటో తెలుసా?
క‌లెక్ట‌ర్ల‌తో కేసీఆర్‌...కీల‌క అంశాల‌పై స‌వివ‌ర చ‌ర్చ‌
గ్రామ వాలంటీర్లపై కొత్త వివాదం...నియామ‌కం ఆగిపోతుందా?
శ్రీశైలంలో కొత్త క‌ల‌క‌లం...అన్య‌మ‌త‌స్తుల ఎంట్రీ..వాహ‌నాలు నిలిపివేత‌
అడ్డంగా బుక్క‌యిన పాక్ ప్ర‌ధాని చెల్లెలు...ఆడుకుంటున్న నెటిజ‌న్లు
కేఏ పాల్‌పై అరెస్ట్ వారెంట్‌...ఇక అదొక్క‌టే ఆప్ష‌న్‌
భార‌త్‌ను మ‌ళ్లీ కెలికిన ఇమ్రాన్‌..క‌ట్ట‌డి చేయ‌క‌పోతే అంతే సంగ‌తి
దేశంలో రిజ‌ర్వేష‌న్లు ఎత్తేస్తారా...ఆర్ఎస్ఎస్ ఏం చేస్తోంది?
అఫిషియ‌ల్ఃటీడీపీ మాజీ మంత్రి జంప్‌..ఆయ‌న‌తో ప్ర‌త్యేక భేటీ
న‌డ్డా...మీ నాట‌కాలు తెలంగాణ‌లో న‌డ‌వ‌వు
ఆటో రంగానికి ఏమైంది...30 వేల మంది ఎందుకు రోడ్డున ప‌డ్డారు?
సైకిల్ పార్టీలో కొత్త‌ పంచాయ‌తీ...తండ్రి వ‌ర్సెస్ కొడుకుల్లో ఎవ‌రికో ప‌గ్గాలు?
త‌లాక్‌పై అమిత్‌షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...ఆ ముస్లిం దేశాల ప్ర‌స్తావ‌న
తెలంగాణ‌లో బ‌డులు మూత‌...బార్లు ఓపెన్‌
అయోధ్య రామమందిరానికి బంగారు ఇటుక‌...ఆఫ‌ర్ ఇచ్చిన హైద‌రాబాద్ ప్ర‌ముఖుడు ఎవ‌రంటే...
ఆర్థిక మాంద్యంలో భార‌త్‌..బ‌య‌ట‌ప‌డేందుకు మ‌న‌కున్న‌ మార్గాలు ఏంటంటే..
71 గొర్రెలు ఇచ్చాడు...అక్ర‌మ సంబంధం లీగ‌ల్ చేసుకున్నాడు
పిచ్చిప‌ట్టిన ట్రంప్‌...అందుకే ఏప్రిల్ ఫూల్ జోక్ ఇప్పుడు
స‌ముద్రం చుట్టూ గోడ క‌డుదాం..కాదుకాదు కొత్త రాజ‌ధాని క‌ట్టేద్దాం
రాజ్‌నాథ్‌లాంటి దౌర్భాగ్యుడు భార‌త్ ర‌క్ష‌ణ మంత్రి...అది మీ దుర‌దృష్టం
రాయ‌ల‌సీమ‌కు తెలంగాణ నీళ్లు...కోదండ‌రాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కాఫీడే చెప్పిన గుడ్ న్యూస్ ఇది
పాక్‌తో దోస్తీ..చైనా ప‌రువు గోవిందా...భార‌త్ ఆప‌రేష‌న్ సూప‌ర్‌
కేసీఆర్‌కు బీపీ పెంచిన ఐదు వందల కోట్ల ఖ‌ర్చు అప్‌డేట్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.