దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా జగన్ ను జనం మెచ్చారు. జగన్ లో వైఎస్సార్ ను చూసుకున్నారు. ఆయన్ను ముఖ్యమంత్రిగా గెలిపించారు. జగన్ కూడా వైఎస్సార్ తరహాలోనే మడమతిప్పను.. మాట తప్పును అంటూ చెప్పుకుంటూ ఉంటారు.


అయితే సీఎంగా వైఎస్సార్ కూ, జగన్ కూ చాలా తేడా ఉందని.. ఆయన దగ్గర పనిచేసే అధికారులు చెప్పుకుంటున్నారట. ఈ అంశంపై ఓ ప్రముఖ పత్రిక విశ్లేషణ అందించింది. రాజశేఖర్‌రెడ్డి తాను ఏదైనా చేయదలచుకున్నప్పుడు దాన్ని అధికారులకు చెప్పేవారని.. వారు సాధ్యాసాధ్యాలను వివరిస్తే అర్థం చేసుకునే వారని అధికారులు చెబుతున్నారట. జగన్ మాత్రం తాను చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్నారట.


ఇందుకు కొన్ని ఉదాహరణలను కూడా ఆ పత్రిక ప్రస్తావించింది. ‘‘రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పనిని చేయాల్సిందిగా నన్ను ఆదేశించారు. ఆ పని చేయడం కష్టమని నేను చెప్పడానికి ప్రయత్నించగా.. అలా అయితే మీరు ఏమీ ఇబ్బంది పడవద్దు. ఫైలు నాకు పంపించండి నేను సంతకం చేస్తాను’’ అని రాజశేఖర్‌రెడ్డి చెప్పారని ఓ అధికారి గుర్తుచేసుకున్నారట.


ప్రస్తుతం జగన్మోహన్‌రెడ్డి వద్ద తమకు ఈ వెసులుబాటు ఉండటంలేదని ఆ అధికారి వాపోయారట. జగన్ కు అధికారులు కొత్తలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రయత్నించగా, ‘‘నేను ముఖ్యమంత్రిని. నేను చెప్పింది జరగాలి’’ అని అనడంతో ఖంగు తిన్నవారు ఎందరో ఉన్నారట. అప్పటి నుంచి జగన్మోహన్‌రెడ్డికి ఎదురుచెప్పడానికి ఒక్క అధికారి కూడా సాహసించడం లేదట. మరి ఈ విశ్లేషణలో ఎంతవరకూ నిజం ఉందో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: