6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను.. ఇది సీఎంగా ప్రమాణ స్వీకారరం చేసిన రోజు జగన్ చెప్పిన మాట. ఆ మాట నిలబెట్టుకునేందుకు జగన్ అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. తన మార్కు చూపించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు.


అయితే ఇదే సమయంలో జగన్ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారన్న వాదన వినిపిస్తోంది. సాధ్యాసాధ్యాలు కూడా గమనించకుండా.. చేయాల్సిందే అని చెప్పడం వారికి ఇబ్బందికరంగా మారిందట. తాజాగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులే కల్పించాలని జగన్ నిర్ణయించారు.


2 రోజుల క్రితం జరిగిన మంత్రిమండలి సమావేశంలో పరిశ్రమలు అన్నింటిలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం ప్రస్తావనకు వచ్చింది. అలా చేస్తే ఎదురయ్యే ఇబ్బందుల గురించి సంబంధిత శాఖ ఉన్నతాధికారి సీఎం జగన్‌కు వివరించే ప్రయత్నం చేశారు. ఇలాంటి నిబంధనలు పెడితే పెట్టుబడులు రావని చెప్పబోయారట.


కానీ జగన్ ఆయన వాదన వినిపించుకోలేదట. ‘‘ముఖ్యమంత్రిగా నేను చెప్పినా జరగదా? మా అధికారులు వద్దంటున్నారు కనుక నేను చేయడం లేదని బయట జనానికి చెప్పుకోమంటారా?’’ అని జగన్మోహన్‌రెడ్డి ఆ అధికారిపై అసహనం ప్రదర్శించారట.


మరింత సమాచారం తెలుసుకోండి: