2019 ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తేంటో ఆ పార్టీ నేతలకే అర్థం కావటం లేదు. 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ. కొన్ని జిల్లాల్లో టీడీపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయిందంటే టీడీపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో టీడీపీ మరలా బలపడాలంటే పార్టీ బాధ్యతలు జూనియర్ ఎన్టీయార్ కు అప్పగించాలని పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు చంద్రబాబు నాయుడుకు సూచిస్తున్నారు. 
 
కానీ చంద్రబాబు నాయుడుగారికి మాత్రం ఎన్టీయార్ కు పార్టీ భాద్యతలు అప్పగించటం ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీయార్ సీఎం జగన్మోహన్ రెడ్డిగారిని కలవబోతున్నట్లు సమాచారం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కోసం జూనియర్ ఎన్టీయార్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. 
 
జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీయార్ ఏ కారణం చేత కలిసినా సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఇదొక హాట్ టాపిక్ అవ్వడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను అభినందించడానికే జూనియర్ ఎన్టీయార్ కలవబోతున్నట్లు తెలుస్తుంది. మరి జూనియర్ ఎన్టీయార్ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం జరిగితే టీడీపీ వర్గాలు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: