ఏపీ సీఎంగా జగన్ దాదాపు రెండు నెలల పాలన పూర్తి చేసుకుంటున్నాడు. ఈ కొద్ది కాలంలోనే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. పరిపాలన పరంగా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు ఓవైపు తీసుకుంటూనే.. ప్రజావేదిక కూల్చి వేత వంటి వివాదాస్పద అంశాల్లోనూ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.


అయితే జగన్ ప్రవర్తన మూర్ఖంగా ఉంటోందని.. ఇది రాష్ట్రానికి మేలు చేయదని ఓ ప్రముఖ పత్రిక తన ఆదివారం సంపాదకీయంలో విశ్లేషించింది. జగన్ వ్యవహారశైలిపై సుదీర్ఘమైన విశ్లేషణ అందించిన ఆ పత్రిక ఓవరాల్ గా చెప్పదలచుకున్నది జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారనే అనిపిస్తోంది.


జగన్ ఏ అధికారి మాట కూడా వినడనీ.. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా అధికారులను ఇబ్బందులు పెడుతున్నాడని.. ఆ విశ్లేషణ వివరించింది. నేను ముఖ్యమంత్రి.. నేను చెప్పింది జరగాల్సిందే.. ఎందుకు జరగదు.. అనే తరహాలో జగన్ అధికారులపై మండిపడుతున్నారట.


ఇందుకు ఉదాహరణగా అనేక ఘటనలను ఆ సంపాదకీయం ప్రస్తావించింది. తెలుగుదేశం అంటే పక్షపాతం చూపుతుందని పేరున్న ఆ పత్రిక.. చివరకు చంద్రబాబు ఇంతటి దారుణమైన ఆర్థిక పరిస్థితితో ఎలా నెట్టుకొచ్చారా అని అధికారులు ఆశ్చర్యపోతున్నట్టు రాసి.. తన మార్కు చెప్పకనే చెప్పింది. మొత్తానికి జగన్ ఓ మూర్ఖుడు అని కంక్లూజన్ కు పాఠకులు వచ్చేలా ప్రయత్నం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: