ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేధికగా ఉద్యోగ కల్పనపై స్పందించారు. వైఎస్ జగన్ అతని సంచలన నిర్ణయంలో ఒక నిర్ణయం గ్రామా వాలంటీర్ల నిర్ణయం ఇప్పటికే అమలయ్యింది. వాలంటీర్ల ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి, త్వరలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ కూడా విడుదల అవనుంది. ఈ నేపథ్యంలోనే అయన ట్విట్ లో స్పందించారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్విట్టర్ లో ''తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాద బలం వల్లే ఇది సాధ్యమవుతోంది.'' అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ కి కొన్ని వేలమంది నెటిజన్లు స్పందిస్తున్నారు 'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్వరాజ్యం. గ్రామ స్వయం పరిపాలన దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్ర ప్రదేశ్. పచ్చ అరాచక పాలన, పచ్చ చొక్కాల జన్మ భూమి కమిటీల కాలికింద నలిగిన గ్రామాలకు విముక్తి దొరికింది. చదువుకున్న నిరుద్యోగుల చేత సంక్షేమం వైపు పరిగెత్తిస్తున్న వైఎస్ ప్రభుత్వం.. హ్యాట్సాఫ్ ముఖ్యమంత్రి గారు అంటూ ట్విట్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: