జగన్‌కి అధికారులకు మధ్య ఇటీవల జరిగిన ఓ ఆసక్తికరమైన మచ్చట ఇది. పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్‌ పట్టుబట్టారు.
ఇందుకు అనుగుణంగా బిల్లు రూపొందించాలని ఆయన అధికారులను కోరారు.
'' స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన విధిస్తే దాని ప్రభావం పెట్టుబడులపై పడుతుందనీ, ఆచరణలో ఇబ్బందులు వస్తాయనీ సంబంధిత శాఖ ఉన్నతాధికారి జగన్‌కి చెప్పే ప్రయత్నం చేయబోగా..''ముఖ్యమంత్రిగా నేను చెప్పినా జరగదా? మా అధికారులు వద్దంటున్నారు కనుక నేను చేయడం లేదని బయట జనానికి చెప్పుకోమంటారా?'' అని జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారట. 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని జగన్‌ అధికారులను ఆదేశించడం వెనుక ఒక కారణం ఉంది.

పాదయాత్రలో జగన్‌, విశాఖ జిల్లా,అచ్యుతాపురం, చిత్తూరు జిల్లా, సత్యవేడు పర్యటించారు.
ఆయా ప్రాంతాలో సెజ్‌లో పరిశ్రమలు వచ్చినప్పటికీ , స్ధానికులకు ఉపాధి తక్కువగా ఉందని, బయట వారినే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని ప్రజలు ఆరోపించారు. అది గుర్తు పెట్టుకొనే జగన్‌ స్ధానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అసలు ఉపాధిలో స్ధానికులకు, నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని సెజ్‌ నిబంధనల్లో ఉంది. దీని వల్ల పెట్టుబడులు ఆగిపోవడం అనే ప్రశ్నేలేదు.

కొందరు అధికారులకు పారిశ్రామిక విధానాల పై అవగాహన లేకపోవడం వల్ల జగన్‌ను తప్పు దోవ పట్టిస్తున్నారు. ఇది మారాలి.
' స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించడం వల్ల పట్టణాలకు వలసలు పోవడం తగ్గుతుంది. సామాజిక అసమానతలు తగ్గుతాయి. గ్రామాలు ఆర్దికంగా బలోపేతం అవుతాయి...'  అని, ఇటీవల సెజ్‌లు ఏర్పాటయిన ప్రాంతాల్లో స్టడీ చేసిన 'రూరల్‌మీడియా' సంస్ధ వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: