అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం.. జాబు రావాలంటే బాబు రావాలి.. ఇలాంటి నినాదాలు ఎన్నికల ముందు చాలా వస్తాయి. కానీ అధికారంలోకి వచ్చాక అవి కార్యరూపం దాల్చడం మాత్రం అంత సులభం కాదు.


కానీ అధికారంలో ఉన్న నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే.. వాటిని అమలు చేసి చూపించవచ్చని.. జగన్ నిరూపించారు. ఇందుకోసం ఆయన కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేశారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం వంటి వ్యవస్థల ద్వారా కొత్తగా ఉద్యోగాలు సృష్టించారు.


ఈ విషయాన్ని స్వయంగా జగన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.. ఈ కొత్త వ్యవస్థల ద్వారా ఏకంగా 1,33,494 శాశ్వత ఉద్యోగాలు రానున్నాయని, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదివారం ట్విటర్‌లో తెలిపారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు అని ఆయన స్పష్టం చేశారు.


పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ.. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నామని, ప్రజల ఆశీర్వాదబలం వల్లే ఇది సాధ్యమవుతోందని జగన్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: