అమ్మ ఒడి కి పాఠ్య పుస్తకాలు కొరత
- కాసుల పంటగా మారిన ప్రైవేటు బక్స్‌స్టాల్స్‌
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అమ్మ ఒడి పథకం అమలు తీరెలా ఉన్నా... ఇప్పటి వరకూ ప్రభుత్వ బడులకు తగినన్ని పాఠ్య పుస్తకాలు అందలేదు. ఆరవ తరగతి నుంచి 10వ తరగతుల వరకూ కొన్ని పాఠ్యపుస్తకాలే సరఫరా అయ్యాయి. ప్రభుత్వ అనుమతితో సరఫరా చేస్తున్న ప్రైవేటు బక్స్‌స్టాల్‌ వ్యాపారులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం సాగుతోంది. 


మండలానికి ఒకరిద్దరికి చొప్పున వ్యాపారస్తులకు పాఠ్య పుస్తకాల విక్రయ అనుమతి ఇవ్వడంతో వాటి సమీపంలోని ప్రభుత్వ , ప్రైవేటు బడుల యాజమాన్యాలు అక్కడే కొనుగోలు చేయాల్సిందిగా సూచిస్తున్నారు. దాంతో ఆయా బుక్స్‌స్టాల్స్‌ యాజమాన్యం వద్ద తల్లిదండ్రులు బారులుతీరుతున్నారు. బుక్స్‌పై ఉన్న ఎంఆర్‌పీ రేటులో పైసా తగ్గకుండా వారు నిర్ణయించిన ధరలతో తల్లిదండ్రుల జేబులు కొల్లగొట్టేస్తున్నారు.


ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత యధావిధిగా ఉంది. ఆరవ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఉపాధ్యాయులు పూర్తిస్తాయిలో లేరు. కారణంపై విశ్లేషిస్తే ప్రభుత్వ ఉదాసీనతగా ఉపాధ్యాయ సంఘాలు విమర్శలు ఎదురవుతున్నాయి. విధ్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫారమ్‌ కూడా పూర్తిస్తాయిలో అందలేదన్నది విధ్యార్థులను బట్టి అవగతమవుతోంది. బడులు తెరచి నెల పూర్తైనా పాఠ్యపుస్తకాల సరఫరా పూర్తిస్తాయిలో లేకపోవటం అమ్మ ఒడి పనితీరుకు అద్దం పడుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: