పులివెందుల.. వైఎస్ కుటుంబం అడ్డా.. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఆ నియోజకవర్గం ఆ కుటుంబం సొంత గడ్డ అయ్యింది. రాజకీయంగా అక్కడ వేరొకరిని ఊహించలేం కూడా. అలాంటి సొంత గడ్డ అభివృద్ధికి జగన్ నడుంబిగించాడు.


అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా పులివెందులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసి.. ఓఎస్డీని నియమించారు. దాదాపు రూ.200 కోట్ల నిధులు కేటాయించి, అభివృద్ధికి కృషి చేశారు.


వైఎస్సార్‌ మరణం తర్వాత పాడాకు నిధులు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ జగన్ సీఎం అయ్యాక.. పులివెందులకు మళ్లీ మహర్దశ పట్టనుంది. జగన్ పులివెందుల అభివృద్ది కోసం రూ.100 కోట్లు విడుదల చేశారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ వ్యవహరిస్తారు. ఈ మేరకు జీవో విడుదలైంది.


ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్రబడ్జెట్ లో పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ పేరుతో రూ.100 కోట్ల నిధులను కేటాయించారు. ఈ ప్రత్యేక నిధులతో అన్ని గ్రామాల్లో కనీస మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేస్తారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఏఏ పనులు చేయించాలో జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: