ఈ మధ్య కరెంట్ బిల్లులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వందల నుంచి వేలల్లోకి మారుతున్నాయి. అప్పుడప్పుడు కొందరికి లక్షల్లోనూ వస్తున్నాయి. కానీ ఈయన కేసు మరీ విచిత్రం ఏకంగా కరెంట్ బిల్లు రూ. 128 కోట్ల రూపాయలు వచ్చేసింది.


మరి ఇంత బిల్లు వచ్చిందంటే.. ఆయన వాడకం ఏ రేంజ్ లో ఉంటుందో అనుకుంటున్నారా.. అలాంటిదేమీ లేదు.. ఆయన ఓ నిరుపేద వృద్ధుడు.. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని చామ్రి గ్రామంలో షామిమ్ అనే వృద్ధుడు భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి 2 కిలోవాట్ల లోడ్ తో కరెంట్ కనెక్షన్ ఉంది.


సాధారణంగా ఆయనకు ప్రతి నెలా.. రూ. 700 నుంచి రూ. 800 మధ్య బిల్లు తమకు వచ్చేదట. కానీ గత నెల మాత్రం కరెంట్ బిల్లు చూసి ఆ వృద్ధుడు తలతిరిగిపోయింది. ఏకంగా రూ. 128,45,95,444 వచ్చింది. ఆయన విద్యుత్ శాఖ అధికారులను అడిగితే వారు కూడా మేమేమీ చేయలేమన్నారట.


ఇంతకీ ఈయన ఇంట్లో వాడే విద్యుత్ వస్తువులు ఏంటో తెలుసా.. ఓ ఫ్యాన్, ఓ లైట్ మాత్రమేనట. అయితే ఇది సాంకేతిక సమస్య కారణంగా వచ్చిన బిల్ అని విద్యుత్ శాఖ అధికారులు వివరణ ఇస్తున్నారు. త్వరలోనే దీన్ని సరి చేస్తామంటున్నారు. మొత్తానికి ఈ కరంట్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: