తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ  పార్టీకి చెందిన ముగ్గురు  ఎంపీలు నేడు  భేటీ అయ్యారు.   తెలుగుదేశం పార్టీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు,  గల్లా జయదేవ్,  కేశినేని నానిలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకొని  తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇటీవల వరుసగా ట్వీట్ల తో పార్టీ నాయకత్వాన్ని రాజకీయంగా ఇరకాటం లోకి నెడుతున్న కేశినేని నాని ,  చంద్రబాబుతో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.


  ఇద్దరు సహచర  ఎంపీలతో కలిసి కేశినేని నాని  చంద్రబాబు నివాసానికి చేరుకొని,  పార్టీకి చెందిన ఎమ్మెల్సీ  బుద్ధా వెంకన్న తో చేసిన ట్వీట్ వారిపై చర్చించినట్లు తెలుస్తోంది .  ట్విట్టర్ వేదికగా బుద్ధా వెంకన్న, కేశినేని నాని పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. బుద్ధా వెంకన్న , కేశినేని నాని లు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు . బుద్ధా వెంకన్న తనపై చేసిన ఆరోపణలకు నాని స్పందిస్తూ  నేరుగా చంద్రబాబు ను ఉద్దేశించి మీ పెంపుడు కుక్కలను కంట్రోల్ చేయండని  హెచ్చరికలు చేయడంతో.... ఇక  కేశినేని నాని టిడిపిని వీడడం  ఖాయమన్న ఊహాగానాలు  వినిపించాయి. 


తాజాగా తో సహచర ఎంపీలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబుతో కేశినేని భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు తెర పడే అవకాశం ఉందని  తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఈ భేటీ పై రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో తాను , గల్లా జయదేవ్ , కేశినేని నాని భేటీ అయినట్లు , ఈ సమావేశం సుహృద్భావ వాతావరణం లో జరిగిందని వెల్లడించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: