ఈవీఎంల ప్రస్తావన ఎత్తని రాజకీయ పార్టీలు
కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ పార్టీ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషిన్‌ (ఈవీఎం)ల టాంపరింగ్‌తోనే 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించగలిగిందని గగ్గోలు పెట్టిన ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు ఎన్నికల అనంతరం నోరు మెదపకపోవటం విడ్డూరమని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అభవృద్ది చెందిన అమెరికా వంటి దేశాల్లోనే ఈవీఎంల వినియోగాన్ని పక్కన పెట్టేశారని అయితే భారత్‌లో ఈ ప్రక్రియను కొనసాగించడం వెనుకబాటుకు నిదర్శనమంటూ అనేక మంది అనేక విధాలుగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 


అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ఈ అంశాన్ని ఏ రాజకీయ పార్టీ పట్టించుకోకపోవటం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు. ఈవీఎంల టేంపరింగ్‌కు అవకాశం ఉందని అనేక మంది ప్రయోగాత్మ వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతటి ప్రమాదకరంగా ఉన్న ఈవీఎంల రద్దుకోసం ఏ రాజకీయ పార్టీ ఎందుకు అంతగా పట్టించుకోవటం లేదనేది మీమాంస.


ఒకవేళ ఈవీఎంల టేంపరింగ్‌ వ్యవహారం వాస్తవమైతే ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో ఉన్నట్టే. అయితే ఈ విషయాన్ని తేటతెల్లం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైనే కాకుండా వామపక్షాలు, ప్రజాస్వామ్య పరిరక్షకులపై ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో తిరిగి బీజేపీ అధికారంలోనికి వచ్చేందుకు ఇప్పటికే పావులు కదపనారంభించింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ జపాన్‌ దేశానికి వెళ్లిరావటం ఇటువంటి సందేహాలకు తావిస్తోందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: