ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు అవినీతి రహిత  ఆంధ్రప్రదేశ్ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని చెబుతున్నారు .  గత ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని త్వరలోనే బయటకు తీస్తామని నేతలు అంటున్నారు .  అసెంబ్లీలో ప్రతి అంశాన్నీ టీడీపీ నేతలు వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని,  దాని ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించారని చూస్తున్నారని మండిపడుతున్నారు.


 గత అసెంబ్లీలో వైకాపా సభ్యులు మాట్లాడేందుకు కనీసం అవకాశం కూడా ఇవ్వలేదని అయితే ప్రస్తుతం టిడిపి సభ్యుల కావలసినంత అవకాశాన్ని ఇస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు .  రాయచోటిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవస్థలన్నింటినీ క్రమం క్రమబద్దీకరించేందుకు బాధ్యతగల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు.  క్రింది స్థాయి నుంచి రెవెన్యూ,  పోలీస్,  సంక్షేమ పథకాలు,  కాంట్రాక్ట్ ల విషయంలో అవినీతి లేకుండా చూస్తామని  అవినీతి నిర్మూలన కోసం మీడియా సహకారం ఎంతో అవసరం అని చెప్పారు.


 సంక్షేమ కార్యక్రమాల ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆయన ,  ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ,  అన్ని రంగాల్లో వారిని  అభివృద్ధి చేయడానికి వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు


మరింత సమాచారం తెలుసుకోండి: