గత ఐదేళ్ల పాటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఉద్యోగాలు ఇస్తా..ఇస్తా..అంటూ మభ్యపెట్టారు కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేక పోయారు.జాబు కావాలంటే బాబు రావాలి అన్న నినాదంతో 2014 లో ఏపీలో బాబు అధికారంలోకి వచ్చినప్పటికీ నిరుద్యోగులకు మాత్రం ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లోనూ మళ్లీ అదే నినాదంతో జాబు రావాలంటే బాబు కావాలి అంటూ ప్రజల్లోకి వెళ్లారు.


కానీ ఈ సారి ప్రజలు తిప్పి కొట్టారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అది జగన్ వల్లే అవుతుందని జనం నమ్మారు కాబట్టి గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని జగన్ కూడా నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఏపీలో త్వరలో భారీగా ఉద్యోగ నియమాకాలు చేపట్టాలి అని జగన్ భావిస్తున్నారట. వివిద కేటగిరీల్లో దాదాపు 'లక్ష ఉద్యోగాల' వరకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.


దేశంలోని ఏ రాష్ట్రం కూడా చేపట్టిన నియమాకాలను చేపట్టి జగన్ చరిత్రలో నిలుస్తున్నారు.లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ లలో 11,000 సర్వే అసిస్టెంట్ లు, 200 వీఆర్వో ఉద్యాగాలు, 10,000 పశుసంవర్దక శాఖలో ఉద్యోగాలు, 11,000 గ్రామ ఇంజనీర్లు,5,000 విద్యుత్ లైన్ మెన్ ఉద్యోగాలు ఇంకా ఇతర కేటగిరీల్లోనూ నోటిఫికేషన్ వెలువడనుందని అంచనా.


ఎలాగూ ఇది వరకే  గ్రామ సచివాలయం పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. అవి కాకుండానే లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: