ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన మార్కు  చూపిస్తున్నారు.  వినూత్న  నిర్ణయాలతో  పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.  ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు ,  ఎమ్మెల్యేలను ప్రభుత్వ హాస్టల్లో నిద్రించాలని జగన్ సూచించిన విషయం తెలిసిందే.  జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు ఇప్పటికే కలెక్టర్లు , ఉన్నతస్థాయి అధికారులు ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించి , విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు .


జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు  తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించారు . దుగ్గిరాల లోని ఎస్సి విద్యార్థినుల హాస్టల్ ను సందర్శించి ఆయన,   విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు .  అనంతరం ఆయన బాయ్స్ హాస్టల్ కి వెళ్లి అక్కడే భోజనం చేసి నిద్రించారు . ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు స్వయంగా హాస్టళ్లను సందర్శిస్తే వారు ఎదుర్కొంటున్న సమస్యలు సత్వరమే పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి . ఈ విషయాన్ని ముందే గ్రహించిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లా కలెక్టర్లు , ఉన్నతాధికారులు హాస్టళ్లను సందర్శించాలని ఆదేశించారు .


అలాగే శాసనసభ్యులు కూడా తమ నియోజకవర్గ పరిధిలోని హాస్టళ్లను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు . జగన్ మాట శిరోధార్యంగా భావించే ఆళ్ల రామకృష్ణారెడ్డి , ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా  హాస్టల్లోనే భుజించి , అక్కడే  నిద్రించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: