అసెంబ్లీలో చంద్రబాబు వ్యవహార శైలి వైసీపీకి ఇరిటేటింగ్ గా ఉందిట. మాటకొస్తే నలభయ్యేళ్ల హిస్టరీ అంటూ బాబు మైకు అందుకోవడంతో పాటు, తాను ప్రతిపక్ష  నాయకుడిని అని, తనకు అవకాశం ఇవ్వరా అంటూ స్పీకర్ తో ఏకంగా గొడవలకు దిగడం వంటి వాటితో అధికార పార్టీకి విసుగు తెప్పిస్తున్నారుట. దాంతో జగన్ ముందే చెప్పినట్లుగా జరుగుతుందా అన్న డౌట్లు  వస్తున్నాయి.


తొలి అసెంబ్లీలోనే జగన్ చెప్పాడు. మేము ఓ అయిదుగురు ఎమ్మెల్యేలను మా వైపు తీసేసుకుంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది అని. మరి చంద్రబాబు ఏ హోదా పట్టుకుని అసెంబ్లీలో ధాటిగా ప్రశ్నలు వేస్తూ వైసీపీపై బురద జల్లుతున్నాడో అదే హోదాని కత్తిరించేందుకు వైసీపీ సిధ్ధపడుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. దానికి మాస్టర్ ప్లాన్ జగన్ రూపొందించారని కూడా అంటున్నారు. టీడీపీ నుంచి వైసీపీ వైపు చూస్తున్న వారు ఓ ఎనిమిది మంది వరకూ ఉన్నారని ఆ మధ్యన ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పారు. 


అందులో నుంచి మళ్ళీ తిరిగి గెలిచే అయిదారుగురిని ఎంపిక చేసుకుని పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్నారుట. వారి చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేయించి మరీ ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లుగా న్యూస్ వస్తోంది. అదే జరిగితే బాబుకు ఉన్న ఎమ్మెల్యేలు తగ్గిపోతారు. ఆ తగ్గిన ఎమ్మెల్యేలతో బాబుకు విపక్ష హోదా కూడా పోతుంది. మరి జగన్ ఈ ప్లాన్ అమలు చేస్తే కనుక టీడీపీకి అసెంబ్లీలో మరిన్ని కష్టాలు తప్పవని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: