- 2019 ఎన్నికలతో బాహాటమైన బీజేపీ మత చాందసం
ఈ దేశాన్నిగాని, రాష్ట్రాలనుగాని పాలిస్తే కేవలం హిందువులే పాలించాలన్నట్టుగా బీజేపీ వ్యవహార శైలి ఉందని రాజకీయ విశ్లేషకులు ఆ పార్టీపై కారాలుమిరియాలు నూరుతున్నారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో బాహాటమైందని వెల్లడిస్తున్నారు. క్రైస్తవ కుటుంభానికి చెందిన జగన్‌ను హిందూ మతంలోనికి చేర్చుకోవటంతోనే ఆ పార్టీ మత ఛాందస రాజకీయ వైఖరి స్పష్టమైందని దుయ్యబడుతున్నారు.


రాజకీయాలకు, మతాలకు మధ్య కనిపించని సున్నితమైన అవినాభావ సంభంధాలు ఉంటాయి. ఈ విషయం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యే ముందు ప్రస్పుటంగా కనిపించింది. జగన్‌ మోహన్‌ రెడ్డి కుటుంభం క్రైస్తవ కుటుంభం అని అందరికీ తెలిసిందే. ఈ విషయం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాలం నుంచి జగమెరిగిన సత్యం.

అంతేకాకుండా ఆయన సోదరిణి షర్మిల, ఆమె భర్త అనిల్‌ కుమార్‌ క్రైస్తవ బోధకుడున్న విషయం బహిరంగ రహస్యమే. షర్మిలతో పాటుగా జగన్‌ తల్లి విజయ లక్ష్మి  కూడా ఎన్నికల ప్రచారంలో క్రైస్తవ సంఘాలను ఓట్ల కోసం అభ్యర్థించిన విషయం తెలిసిందే. అంతటి భాహాటంగా తెలిసినప్పటికీ విశాఖ శారధాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జగన్‌ మోహన్‌ రెడ్డికి హిందుత్వంలోనికి ఎందుకు కలిపినట్టు అనే ప్రశ్న మీమాంసగా తయారైంది.

ముఖ్యమంత్రి  పీఠంపై క్రైస్తవులుగాని, ముస్లీమ్‌లుగాని కూర్చోనివ్వరాదనే బీజేపీ కుఠిల ఆలోచన జగన్‌ వ్యవహారంలో బాహాటమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఆగమేఘాలపై జగన్‌కు బీజేపీ శక్తులు హిందుత్వంలోనికి మమేకం చేశారని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితులను పరిశీలిస్తున్న ఆ పార్టీలోని మైనారిటీ నాయకులు భవిష్యత్‌లో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: