రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని శత్రువులు గాని ఉండరనేది జగమెరిగిన సత్యం. అయితే ఆంధ్ర రాష్ట్ర  రాజకీయాల్లో 2019 ఎన్నికల్లో పరస్పర  శత్రువులుగా మెలిగిన బీజేపీ, తెలుగు దేశం పార్టీలు తిరిగి మిత్రులు కానున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో పట్టు నెలకొల్పుకున్న బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీకు మద్దతు తెలపడంతో పాటు స్పెషల్ స్టేటస్ ఉద్యమం తెలుగు దేశానికి గనవిజయం చేకూర్చింది. 

అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలం పొందే విధంగా సన్నాహాలు చేపట్టడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆ పార్టీతో విభేదిస్తూ వచ్చాడు. దాంతో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిలబెట్టి చంద్రబాబునాయుడిని  పూర్తిగా దెబ్బతీసింది. తాజాగా జగన్ ప్రభుత్వం పై అదే వ్యూహంతో వ్యూహరచన చేయడంతో జగన్ కూడా బీజేపీ తో విభేదించే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో శత్రువులుగా  వ్యవహరించిన బీజేపీ, టీడీపీ లు తిరిగి మిత్రులుగా ఒక్కటవనున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను బీజీపీలోనికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. నలుగురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను కలుపుకున్న బీజీపీలో విలీనం చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: