అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి అంటే రోజా మాటలు అసెంబ్లీ వినపడతాయని, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీపై ఆమె సంచలన విమర్శలు చేస్తుందని వార్తలు వచ్చాయి.  ఈ వార్తల్లో నిజం ఎంతవరకు ఉన్నది అనే విషయం తెలియదుగాని, రోజా మాత్రం అసెంబ్లీలో చాలా సైలెంట్ గా ఉంటోంది.  కారణం ఏంటి అన్న సంగతి తెలియదు.  


దీనిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఆలోచిస్తున్నారు.  విమర్శలు చేస్తున్నారు.  ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదని, అందుకే ఆమె దూరంగా ఉంటున్నారని అంటే.. లేదు అసెంబ్లీలో మిగతావాళ్ళు మాట్లాడుతున్నారు కదా తానెందుకు మాట్లాడటం అని చెప్పి సైలెంట్ గా ఉంటున్నారని మరికొన్ని వార్తలు. 


మరికొంతమంది అభిప్రాయం ప్రకారం, రోజా మాట్లాడటం విషయంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారని, ఆధ్యాత్మిక బాటలో నడవాలని అనుకుంటున్నారని, అందుకే రోజా సైలెంట్ గా ఉన్నారని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహనం కోల్పోకూడదని ఆమె అనుకుంటున్నట్టు సమాచారం.  


ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయి అన్నది ఎవరికీ తెలియడం లేదు.  రోజాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పోస్టింగ్ ఇచ్చిన తరువాత చాలా బిజీ అయ్యారు.  ఎలాగైనా పరిశ్రమలను ఏపి కి తీసుకొచ్చేందుకు ఆమె కృషి చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: