త్వరలో జగరనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికీ వారే ఒంటరిగా పోటీచేసేందుకు వ్యూహరచన  చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవుల కాలగడువు ముగియడంతో వారి స్థానంలో స్పెషల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారిచేరిన విషయం తెలిసిందే.  రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసిందే. ఇటీవలే గ్రామ సచివాలయం నోటిఫికేషన్  జారీచేసిన  నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ఆయా రాజకీయ పార్టీలు తమ సన్నాహాలు గోప్యంగా చేసుకుపోతున్నట్టు  తెలిసింది. కాంగ్రెస్ ను ఇప్పటికి విశ్వసించే పరిస్థితుల్లో ప్రజలు లేరని అర్ధమైపోతుంది. తెలుగు దేశం పార్టీ పట్ల వ్యతిరేకత ఈ ఎన్నిక్కలో కూడా కనిపించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బీజేపీ విషానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. బీజేపీ పార్టీ జెండాను, గుర్తును  గ్రామీణ ప్రజానీకానికి తెలిసేలా చేయాలనే సంకల్పంతో ఉన్నారు. 

అధికార పక్ష వైఎస్సార్సీపీ కూడా వ్యక్తిగతంగానే పోటీ చేసి గ్రామస్థాయిలో పట్టును నిలుపుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. 2019 విజయాన్ని కాపాడుకోవడంతో పాటు 2024 లో పట్టు సాదించేందుకు ఇప్పటినుంచే పునాదులు వేసుకుంటోంది.
   


మరింత సమాచారం తెలుసుకోండి: