జగన్ ముఖ్యమంత్రిగా  రెండు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ  తన మార్క్ పాలనతో ప్రశంసలు అందుకుంటున్నాడనేది  ఒక కోణం అయితే, మరో కోణంలో మాత్రం జగన్ పై రోజురోజుకి  విమర్శలు పెరుగుతున్నాయి.  ముఖ్యంగా జగన్ ఇచ్చిన హామీలు  అమలు పర్చలేనివి అని  టీడీపీ మండిపడుతుంటే, మరోవైపు జగన్ పై  ఎక్కువుగా అంచనాలు పెట్టుకున్న  ప్రజలు పూర్తిగా నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో జగన్  హామీల పై  ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది. అప్పుడే వస్తున్న ఆరోపణలకు బ్రేక్ పడతాయి.  పైగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కూడా జగన్ ప్రజలకు నమ్మకం కలిగించాడు. 

 

ఇప్పుడేమో బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పుకొస్తోంది. అయినా జగన్ మాత్రం  ప్రత్యేక హోదా విషయంలో ఏమి మాట్లాడట్లేదు. అసలు ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తోన్న కార్యచారణ ఏమిటీ, హోదా కోసం ఏం చెయ్యబోతున్నాడనే విషయాలు  ప్రజలకు చెప్పాల్సిన  అవసరం  ఉంది. అలాగే రాజధాని నిర్మాణం విషయంలో కూడా జగన్ ఖచ్చితమైన స్పష్టత ఇవ్వాలి.  ఎన్ని సంవత్సరాల్లో రాజధానిని నిర్మిస్తాడనేది కూడా క్లారిటీగా ప్రజలకు చెప్పాలి.  ఇక అన్నిటికి కన్నా..  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చాడు.  అయితే ఈ హామీ పై  ఇంకా ఎటువంటి ప్రకటన లేదు.  ఇలా చెప్పుకుంటే పొతే అవినీతి నిర్మూలన. వృద్దులు మూడు వేల పెన్షన్  ఇలాంటి  కీలకమైన హామీల పై స్పష్టత ఇవ్వకపోతే  జగన్ మళ్లీ సీఎం కావడం కష్టమే. కాబట్టి జగన్ ఇప్పటికైనా మేలుకో !  


మరింత సమాచారం తెలుసుకోండి: