ఎన్నికలకు ముందు,  పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా  అదొక ప్రభంజనంలా మారేది.  ఎక్కడ చూసినా  జన సైనికులే. మరి ఆ సైన్యం అంతా ఏమైపోయిందో ఏమో గాని  పవన్ కళ్యాణ్ మాత్రం  కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకలేకపోయాడు.  ఆ మధ్య  జనసేనాని ఎం చేస్తున్నాడు ?, ఎక్కడ పర్యటిస్తున్నాడు ? అని  సోషల్ మీడియాలో తెగ హడావుడి కనిపించేది.  ఆ ప్రభంజనం అంత ఎన్నికల ఫలితాలతో ఆవిరైపోయింది. చివరికీ పవన్ కి  తీవ్ర నిరాశనే మిగిలింది.  సినిమాల్లోని గ్లామర్,  రాజకీయాల్లో వర్కౌట్ కాదని పవన్ కళ్యాణ్ కి  ఈ పాటికి స్పష్టంగా  అర్థమై ఉటుంది.   అందుకే పూర్తి రాజకీయ నాయకుడిగా మారిపోవాలని పవన్ కాస్త గట్టిగానే ఫిక్స్ అయ్యాడట.  ఎన్ని కోట్లు ఇస్తామన్న సినిమాలు మాత్రం చేసేది లేదు అంటున్నాడు.    


నిజానికి,  పవన్ కళ్యాణ్  ఎలాగూ  ఓడిపోయాడు కాబట్టి,  ఇక  సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడని అందరూ భావించిన మాట వాస్తవం.  కానీ పవన్ ఎట్టి పరిస్థితుల్లో సినిమాల్లో నటించేది లేదని చాల స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు.  చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని అంటున్నాడు. అయితే తానా సభల్లో కనిపించిన పవన్  మళ్ళీ  పెద్దగా బయట కనిపించింది లేదు.   ప్రస్తుతానికి పవన్ ఎం చేస్తున్నారో అని ఆయన అభిమానులతో పాటు.. టీడీపీ వైసీపీ వాళ్ళు  కూడా ఆరా తీస్తున్నారు.  అయితే జనసేనాని మాత్రం సీక్రెట్ గా పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారని, ఈ సారి ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకునేలా  పక్కా  ప్లాన్ తో రంగంలోకి దిగటానికి కసరత్తులు చేస్తున్నాడని జన సైనికులు లీకులు వదులుతున్నారు.  



ఆ ప్లాన్ లో ముఖ్యంగా టీడీపీకి తాను వ్యతిరేకిని అని, అలాగే జగన్ అబద్దపు హామీలకు కూడా  తాను వ్యతిరేకిని అని.. మొత్తంగా బాబు అండ్ జగన్ కన్నా  తానే నిజాయితీ పరుడిని అని.. వారిద్దరి పై అవినీతి కేసులు ఉన్నాయని, వారిద్దరూ ఇచ్చిన హామీలను అమలు పరచలేరని.. ఎందుకంటే వాళ్ళు  అమలకు సాధ్యం కానీ హామీలు ఇస్తారని.. వాళ్ళను నమ్ముకోవడం వృధా అని పవన్ ప్రజలకు అర్ధమయ్యేలా చేయటానికి పలు ఇంట్రస్టింగ్ యాడ్స్ చేపించే ప్లాన్ చేసుకుంటున్నాడట.  మరి జగన్ - బాబుల  పై పవన్ ప్లాన్ పనిచేస్తోందా...  ఏమో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: