కర్ణాటక అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరగాల్సిన సమయంలో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం కుమారస్వామి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో కుమారస్వామి చికిత్స పొందుతున్నారు.


హైబీపీ వల్ల కుమార స్వామి ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. అయితే విశ్వాస పరీక్షలో ఓటమిభయంతోనే కుమార స్వామి అనారోగ్యం డ్రామా ఆడుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. సోమవారమే కుమార స్వామి సర్కారుకు ఆఖరి రోజని బీజేపీ నేత యడ్యూరప్ప కామెంట్ చేశారు.


ఇదిలా ఉంటే.. నిన్న మొన్నటివరకు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ తాజాగా ప్లేట్ ఫిరాయించారు. కాంగ్రెస్-జేడీఎస్‌కు తన మద్దతు ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు. దీంతో సంకీర్ణ సర్కారు నేతలు కంగారు పడ్డారు.


ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి సంకీర్ణ సర్కారుకే తమ మద్దతు అని ప్రకటించడంతో కాంగ్రెస్- జేడీఎస్ నేతలు ఊపిరిపీల్చుకున్నారు. బలపరీక్షవేళ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా చాలా విలువైంది కావడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 106. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ బలం 107 ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: