జగన్ మంచిగా పాలన చేయాలని ఆశిస్తున్నాడు. ఆయన ప్రమాణం చేసిన దగ్గర నుంచి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఏపీని  సమూల ప్రక్షాళన చేయాలన్నది జగన్ సంకల్పం. ఆ దిశగానే జగన్ నిర్ణయాలు కూడా ఉంటున్నాయి. మరి జగన్ ఎలాంటి సీఎం గా ఉంటున్నారిపుడు.



అయితే జగన్ మాత్రం టీడీపీకి బాగా టార్గెట్ అయిపోయాడు. రెండు నెలల్లోనే చెడ్డ ముఖ్యమంత్రిగా జగన్ ప్రూవ్ చేసుకున్నాడంటూ మాజీ మంత్రి జవహర్ విమర్శించడం విశేషం. అలాగే, జగన్ కేవలం రెండు నెలల్లో ఏపీని 60 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లాడని ఆయన అంటున్నారు.  రివర్స్ టెండరింగ్ అనేది అవినీతిని ఏరేయడానికి కాదని, ప్రాజెక్టులను తమ సొంత కాంట్రాక్టర్లకు ఇప్పించే ఎత్తుగడ మాత్రమే అని ఆయన ఆరోపించారు. 


ప్రజా రంజక పాలన ఇస్తానని చెప్పిన జగన్ అన్నీ యుటర్న్ లు తీసుకుంటున్నారని... ఆశా వర్కర్లకు తెలుగుదేశం ప్రభుత్వం జీతాలు రెట్టింపు చేసి 8600 రూపాయలు చెల్లిస్తే జగన్ వచ్చి కేవలం 1400 పెంచాడని, కానీ అది అమలులోకి రాకుండా మాటల్లోనే ఉండిపోయిందని దుయ్యబట్టారు. 


పాపం ఇప్పటికీ వారు ధర్నాలుచేస్తున్నారని జవహర్ అన్నారు మొత్తానికి చంద్రబాబు ఆక్రోశం ప్రతి తమ్ముడిలోనూ కనిపిస్తోంది. మరి జగన్ దీనికి సరైన కౌంటర్లు ఎలా ఇస్తాడో చూడాలి. తనదైన మార్కు  పాలనే జవాబు అని జగన్ చెబుతారేమో మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: