కేసీఆర్, హరీశ్ రావు బంధం చాలా బలమైందని అంటారు. ఉద్యమసమయంలోనూ.. మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలోనూ హరీశ్ రావు కేసీఆర్ కు కుడి భుజంగా వ్యవహరించారు. కానీ ఆ తర్వాత కేటీఆర్ ప్రాధాన్యం పెరిగి హరీశ్ రావు సైడ్ అయ్యారు.


ఇప్పుడు పరిస్థితి ఎంతదాకా వచ్చిందంటే.. కనీసం మంత్రి పదవిలేదు.. పార్టీలోనూ పదవి లేదు.. అయినా హరీశ్ రావు మాత్రం ఎక్కడా అసంతృప్తి కనిపించనివ్వడం లేదు. కేసీఆర్ పట్ల అదే విధేయత చూపుతున్నారు.


తాజాగా హరీశ్ రావు కేసీఆర్ పట్ల చేసిన వ్యాఖ్యలు ఆ విధేయతనే తెలుపుతున్నాయి. కేసీఆర్‌ ప్రజల కష్టాలు తెలిసిన మనిష అంటూ హరీశ్ రావు పొగడటం విశేషం. పింఛను కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్.. ఎన్నికల ముందు టిఆర్ఎస్ ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్ల పెంపు జరిగిందన్నారు.


సిద్దిపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ వల్ల ఈ ప్రక్రియ 6 నెలలు ఆలస్యమయిందని చెప్పారు. త్వరలోనే అర్హులందరికీ రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: