తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు ఇచ్చిన చేయి చంద్రబాబుది. అధికారంలో ఉంటూ మూడు మార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాజ్యసభ సభ్యుల‌ ఎంపిక నుంచి మామూలు నామినేటెడ్ పోస్ట్ వరకూ అన్నీ కూడా తన చేతుల మీదుగానే పంపిణీ చేస్తూ వచ్చారు. వాటి కోసం బాబు అనేక శల్య పరీక్షలు నిర్వహించేవారు.


ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఎటూ కాని విధంగా 23 మంది ఎమ్మెల్యేలతోనే బాబుకు ప్రతిపక్ష పాత్ర దక్కింది. దాంతో చంద్రబాబు కనీసం ఎమ్మెల్సీ పోస్ట్ కి కూడా పోటీ పడలేరు. దాంతో ఆయన వద్ద ఉన్నది ఒకే ఒక పోస్ట్. అదే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మం. ఈ పోస్ట్ కొంచెం ప్రతిష్టాత్మకమైనదే. హడావుడి, అధికార దర్పం  ఉన్న పోస్ట్.


అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వారికి తలకాయ నొప్పిలాంటి పోస్ట్. ఈ పోస్ట్ దక్కలేదనే జ్యోతుల నెహ్రూ వైసీపీని విడిచి టీడీపీలోకి జంప్ చేశాడు. ఇపుడు ఈ పోస్ట్ టీడీపీని కూడా ఇరకాటంలో పెడుతోందట. ఈ పదవి కావాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు.


ఆయన సైలెంట్ వెనక ఇంతటి వైలెంట్ ఉందని అంటున్నారు. ఈ పదవి దక్కకపోతే ఆయన తన దారి తాను చూసుకుంటారన్నమాట. బాబు మనసులో మాత్రం పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఈ పదవికి ఎంపిక చేయాలని బాబు అనుకుంటున్నారుట. అదే జరిగితే గంటా టీడీపీ గడప దాటడం ఖాయమంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: