కేసీఆర్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోందా..రాజకీయంగా ఇప్పటివరకూ ఏ సీఎంకూ లేనంత వెసులుబాటు ఉండటంతో కేసీఆర్ ఇక తన మనసులో ఆలోచనలన్నీ ఇంప్లిమెంట్ చేసేస్తారా.. ఇప్పుడు పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది.


ఇప్పటికే సంచలనాలకు నిలయమైన మున్సిపల్ బిల్లును తీసుకొచ్చిన కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా వీఆర్వో వ్యవస్థనే రద్దు చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. వీఆర్వోలను పంచాయతీరాజ్‌ లేదా వ్యవసాయశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడొచ్చట.


రెవెన్యూ శాఖలో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యో గుల్లో అవినీతి పెరిగిపోయిందని, వీరిని సంస్క రించకపోతే రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదమని సీఎం కేసీఆర్‌ బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. తన సొంత పత్రిక నమస్తే తెలంగాణలో రోజూ రెవెన్యూ అధికారుల అవినీతిపై వరుస కథనాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే అంశాన్ని కేసీఆర్‌ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.


సీఎం, సీఎస్, భూ పరి పాలన ప్రధాన కమిషనర్‌కు లేని అధికారాలు కూడా వీఆర్‌ఓల కున్నాయని ఆ మధ్య అసెంబ్లీలో కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తే అధికారుల్లో వ్యతిరేకత పెరుగుతుందా.. దీని ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: