మొన్నటి ఎలక్షన్స్ లో జనసేన పార్టీతో పాటు పవన్ కల్యాణ్ కూడా ఘోరంగా ఓడిపోయాడు. జనసేన సభ్యత్వాలు ఎక్కువగా నమోదయ్యాయని నమ్మకంగా భీమవరం నుంచి పోటీ చేస్తే అనూహ్య ఓటమి ఎదురైంది. దీన్నుంచి త్వరగానే తేరుకున్న పవన్ అభిమానులను, కేడర్ ను నిరుత్సాహానికి  గురికానీయలేదు.

 

ప్రజాసమస్యలపై పోరాడండి.. జనసేన మీకు అండగా ఉంటుందని ధైర్యం నింపాడు. ఈ ఎన్నికల్లో ఓటమిని మరచిపోయి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దృష్టి పెట్టాలని నాయకులకు, కేడర్ కు సూచించాడు. సెప్టెంబర్ తరువాత జరిగే మున్సిపల్ ఎన్నికలపై ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని ఆదేశాలిచ్చాడు. పట్టణాల్లో, నగరాల్లో బలం పెంచుకునే దిశగా పని చేయండని పిలుపునిచ్చాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా పట్టు సాధిస్తే ప్రజా సమస్యల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవొచ్చని పవన్ ఆలోచన.

 

అయితే వచ్చిన సమస్యల్లా జనసేన నాయకులతోనే. మొన్నటి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ ఖర్చుపెట్టే పరిస్థితుల్లో లేరు. జనసేనకు పవన్ ఫ్యాన్స్, కేడర్ కు కొదవలేదు. కేడర్ ఉత్సాహంగానే ఉన్నా నాయకత్వలేమి మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. మరి పవన్ అందరినీ ఎలా సమన్వయం చేసుకుని ఎన్నికలకు ఎలా సమాయాత్తమవుతాడో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: