ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీయార్ ను ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబోతున్నారట. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని జూనియర్ ఎన్టీయార్ పేరును జగన్మోహన్ రెడ్డిగారి దగ్గర ప్రతిపాదించాడట. జూనియర్ ఎన్టీయార్ మామ నార్నె శ్రీనివాసరావ్ కూడా ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నాడు కాబట్టి జూనియర్ ఎన్టీయార్ ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృధ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిన్నటినుండి వార్తలు వినిపిస్తున్నాయి. 
 
మరో వైపు ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా పీవీ సింధు పేరును కూడా పరిశీలిస్తున్నారట. జూనియర్ ఎన్టీయార్ ఒప్పుకోని పక్షంలో ఈ అవకాశం పివి సింధుకు వస్తుందని తెలుస్తుంది. మరి జూనియర్ ఎన్టీయార్ ఒప్పుకుంటాడా అంటే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ప్రతిపాదనకు జూనియర్ ఎన్టీయార్ ఒప్పుకోకపోవచ్చనే సమాధానమే వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీయార్ ఈ ఆఫర్ వద్దనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 
 
జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టీడీపీతో జూనియర్ ఎన్టీయార్ కు సంబంధాలు ఉన్నమాట వాస్తవం. గతంలో ఒకసారి జూనియర్ ఎన్టీయార్ మీడియాతో మాట్లాడుతూ తాను తాత స్థాపించిన పార్టీలోనే ఉంటానని జూనియర్ ఎన్టీయార్ ప్రకటించాడు. జూనియర్ ఈ పదవికి ఓకె చెబితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుండే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందువలన ఎన్టీయార్ ఈ ఆఫర్ ఒప్పుకునే అవకాశమే లేనట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: