చంద్రబాబునాయుడులో అసెంబ్లీ ఫీవర్ పెరిగిపోతోంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వాలన్న నిర్ణయం ఉపసంహరణపై ప్రపంచబ్యాంక్  తాజా ప్రకటనతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. సోమవారం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అండ్ కోను ఎలా ఫేస్ చేయాలనే విషయంలో ఎల్లో గ్యాంగ్ మల్లగుల్లాలు పడుతోంది.

 

రాజధాని నిర్మాణానికి అప్పు ఇవ్వాలన్న నిర్ణయం జగన్ ప్రభుత్వ చేతకాని తనం వల్లే జరిగిందంటూ చంద్రబాబు, లోకేష్ తో పాటు ఎల్లో మీడియా కూడా జగన్ పై విషప్రచారం చేస్తోంది. అయితే వాళ్ళందరికీ ప్రపంచబ్యాంకు పెద్ద షాకే ఇచ్చింది. అప్పు విషయంలో తమ నిర్ణయానికి జగన్ ప్రభుత్వానికి ఏమీ సంబంధ లేదని తేల్చేసింది. కేంద్రప్రభుత్వ వైఖరి వల్లే తాము నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో చెప్పింది.

 

ప్రపంచ బ్యాంకు తాజా ప్రకటనతో ఇపుడు చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లో మీడియాకు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. అసలే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును జగన్ బృందం వాయించేస్తోంది.  జగన్ పై దండయాత్ర చేయటానికి అంశమేదీ దొరకని నేపధ్యంలో ప్రపంచబ్యాంకు నిర్ణయాన్ని చంద్రబాబు అండ్ కో ఉపయోగించుకున్నది.

 

నిజానికి ప్రపంచబ్యాంకు నిర్ణయానికి జగన్ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని అందరికీ తెలుసు. కానీ మొన్నటి ఎన్నికల్లో వైసిపి చేతిలో  టిడిపిని ఘోరంగా ఓడిన దగ్గర నుండి  చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లో మీడియా కూడా బాగా మంటగా ఉంటోంది.  ఆ మంటనే ఈ రూపంలో తీర్చుకున్నది. ఇపుడదే విషయాన్ని  అసెంబ్లీలో ఎలాగూ వైసిపి లేవనెత్తటం ఖాయం. అప్పుడు తమ విషప్రచారాన్ని ఎలా సమర్ధించుకోవాలో అర్ధంకాకే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: