ఏ రాజకీయ పార్టీకైనా పట్టణ,  గ్రామస్ధాయిలో పార్టీ కార్యకర్తలే ఆయువుపట్టు. తెలుగుదేశంపార్టీ నేతలకు సంబంధించి పై స్ధాయిలో బలహీనంగా ఉన్నా అట్టడుగు స్ధాయిలో  ఉన్న క్యాడర్ బలంతోనే నెట్టుకొస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే దారంలో నడుస్తున్నారు. గ్రామీ, పట్టణ స్ధాయిలో క్యాడర్ ను బలోపేతం చేసుకోవటంలో భాగంగా ఏకంగా లక్షల ఉద్యోగాలు కల్పించారు.

 

వార్డు, గ్రామీణస్ధాయిలో జరుగుతున్న వాలంటీర్ల ఎంపిక గనుక పూర్తియిపోతే జగన్ వ్యూహం ఫలించిందనే అనుకోవాలి. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన కుటుంబాలకు అందించేందుకే వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ చెప్పారు. అందుకనే 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించబోతున్నారు.

 

సరే వైసిపి ప్రభుత్వంలో జరుగుతున్న నియామకాల్లో వాళ్ళకే పెద్ద పీఠ వేస్తారని ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు. పట్టణాల్లో అయితే సుమారుగా 80 వేల వార్డు వాలంటీర్లు, గ్రామాల్లో సుమారు 2.20 లక్షల వాలంటీర్ల నియామకాల ఎంపిక జరుగుతోంది. ఆగస్టు 25వ తేదీకల్లా నియామకాలు పూర్తి అయిపోతాయి. మొత్తం జాబితాను ప్రభుత్వానికి అందచేస్తే వెంటనే అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చేస్తారు. ఆగస్టు 15వ తేదీకి వాలంటీర్లందరూ ఉద్యోగాల్లో చేరాలి.

 

ఒక్కసారిగా 3 లక్షల మందికి ఉపాధి/ ఉద్యోగం కల్పించటం మామూలు విషయం కాదు. 3 లక్షల మందంటే కనీసం 10 లక్షల మంది అన్నట్లు లెక్క. ఉన్న ఊర్లోనే 5 వేల రూపాయల జీతంతో ఉద్యోగం అంటే చిన్న విషయం కాదు కదా ? జీతం తీసుకునే వాళ్ళు జగన్ ఆశయాలకు తగ్గట్లు పనిచేస్తేనే ప్రభుత్వానికి, పార్టీకి మంచిపేరు వస్తుంది. అలాకాకుండా ఆచరణలో టిడిపి హయాంలో జన్మభూమి కమిటిల మాఫియాలాగే తయారైతే.....

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: