అర్ధంకాని రాజకీయాలు దేశంలో ఏవైనా ఉన్నాయా అంటే అవి కర్ణాటక రాజకీయాలే అని చెప్పాలి.  కర్ణాటకలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు.  అంతుపట్టని రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే ఈ రాజకీయాల్లో ఇప్పుడు అనిశ్చితి నెలకొంది.  16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.  ఇందులో రెబల్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి తిరిగి తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.  


15 మంది మాత్రం ససేమిరా అంటూ భీష్మించుకు కూర్చున్నారు.  బలనిరూపణ చేసుకోవాలని ఇప్పటికే రెండుసార్లు  లేఖలు రాసినా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.  ఈరోజు బలనిరూపణ విషయంపై మరోమారు చర్చ జరగబోతున్నది.  


ఈ చర్చ జరుగుతుండగానే జేడీఎస్, కాంగ్రెస్ లో సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశాయి.  గవర్నర్ లేఖలు, ఎమ్మెల్యేల రాజీనామాల విషయం, అనర్హత వేటు తదితర అంశాలపై కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. బలనిరూపణ విషయంలో మరో 20 మంది సభలో మాట్లాడాలని ఆ తరువాతే నిరూపణ ఉంటుందని అంటున్నారు.  


దీన్ని బట్టి చూసుకుంటే ఈరోజు కూడా నిరూపణ లేకపోవచ్చు.  ఒకవేళ గవర్నర్ ఇచ్చిన డెడ్ లైన్ దాటిపోవడంతో తన సర్వాధికారాలు ఉపయోగించి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అధికారం గవర్నర్ కు ఉంటుంది.  ఒకవేళ ఆయన అలా చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: