గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రధేశ్ రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ పార్టీలు అమరావతికి ప్రపంచ బ్యాంకు నుండి రుణం రాకపోవాడనికి మీరంటే మీరు కారణమంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లోని ఇతర పట్టణాల్లో మౌలిక సదుపాయల ప్రాజెక్ట్ కు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. గతంలో ప్రతిపాదించిన మొత్తం కంటే ఎక్కువ మొత్తం ఇవ్వటానికి కూడా సిధ్ధమేనని ప్రపంచ బ్యాంక్ ప్రకటించిందని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రకటన వచ్చింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వటానికి సిధ్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వటంతో వైసీపీ ప్రభుత్వం ప్రత్యమ్నాయ ప్రతిపాదనలు ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తోంది. అమరావతికి రుణం ఇవ్వకపోవటానికి కేంద్ర ప్రభుత్వం సూచనలే కారణమని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఏపీ అభివృధ్ధి విషయంలో మాత్రం సహకారం ఉంటుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 
 
విపత్తు నిర్వహణ, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సాయాన్ని అందిస్తూన్నామని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అమరావతిలో జరిగిన భూసేకరణలో అక్రమాల వల్లే రుణాన్ని రద్దు చేసామని ప్రపంచ బ్యాంక్ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిన ప్రకటనలో తెలిపింది. వైసీపీ ప్రభుత్వం త్వరలోనే ఒక కీలక ప్రాజెక్ట్ ను ఎంపిక చేసి రుణం కోసం కొత్త ప్రతిపాదనలు పంపబోతున్నట్లు తెలుస్తుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: