బీజేపీ రాజకీయం ఇపుడు కాంగ్రెస్ ని సైతం మించిపోయింది. రాష్ట్రాలలో అధికారాలు చేపట్టేందుకు అన్ని దారులూ తొక్కొతోంది. వీలున్నంతవరకూ తన అధికారాలన్నీ ఉపయోగిస్తోంది. దేశంలో ఇపుడున్న పరిస్థితుల్లో చెప్పాలంటే బీజేపీకి ఎదురులేదు. ఈ ఎదురులేనితనమే రాజ్యాంగ నియమాలను కూడా తుంగలోకి తొక్కేలా చేస్తేనే అసలుకు ముప్పు అంటున్నారు మేధవులు.


ఇదిలా ఉండగా ఏపీలో బలపడదామనుకుంటున్న బీజేపీ నలుగురు టీడీపీ ఎంపీలను తన వైపు లాగేసుకుంది. వారిలో ఇపుడు సుజనా చౌదరిని కేంద్ర మంత్రిగా చేస్తారని టాక్ నడుస్తోంది. ఇందుకు ఒక షరతుని బీజేపీ హై కమాండ్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఆ షరతు ఏంటంటే ముందుగా ఆయన బ్యాంకులకు చెల్లించవలసిన రుణ బాకీలను తీర్చాలని ,అప్పుడు కేంద్రంలో పదవి ఇవ్వడానికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారని బిజెపి నేతలు అంటున్నారు.రాజకీయాలలో ఏమైనా జరగవచ్చంటే ఇదే కదా.


మొత్తానికి ఇది షరతు అయినా సుజనా లాంటి వారికి చిటికలో పని కాబట్టి ఆయన ఏదో విధంగా మ్యానేజ్ చేసి అప్పులు లేవనిపించుకుంటారు. ఆ మీదట మోడీ వంటి నీతిమంతుని క్యాబినేట్లో మంత్రిగా చేరిపోతారు. చూడబోతే బీజేపీ నీతి కధలు ఇలాగే ఉంటాయన్నమాట. మరి కాంగ్రెస్ కి, బీజేపీకి తేడా ఏముందో జనాలే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: