అసెంబ్లీలో ఫిరాయింపులపై జరిగిన చర్చలో వైసిపి ఎంఎల్ఏ చంద్రబాబునాయుడును ఉతికి ఆరేశారు. ఉతకటం అనేకన్నా నిజంగా చాకిరేపు పెట్టారనే చెప్పాలి.  ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎంఎల్ఏ అన్నా రాంబాబు మాట్లాడుతూ నైతిక విలువులు లేని, సంప్రదాయాలు పాటించని, చట్టాన్ని కూడా బేఖాతరు చేసిన చంద్రబాబు పక్కన సభలో కూర్చోవాల్సిన ఖర్మ తమకు పట్టిందంటూ రెచ్చిపోయారు.

 

టిడిపి హయాంలో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను 3 ఎంపిలను ప్రలోభలకు గురిచేసి చంద్రబాబు  ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని అన్నా రాంబాబు గుర్తు చేస్తు చంద్రబాబుపై మండిపోయారు. రాజకీయాల్లో ఏమాత్రం విలువలు లేని చంద్రబాబు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండటం అసెంబ్లీకే  అవమన్నారు.

 

విలువలను తుంగలో తొక్కిన చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటానికి ఎంతమాత్రం తగడంటూ తన అభిప్రాయాన్ని చంద్రబాబు మొహం మీదే స్పష్టంగా చెప్పారు. తన గురించి అన్నా చెప్పినపుడు చంద్రబాబు సభలోనే ఉండటం విచిత్రం. ఇంతకన్నా ఇంపార్టెంట్ ఏమిటంటే అన్నా వ్యాఖ్యలను టిడిపి ఎంఎల్ఏల్లో ఒక్కరు కూడా అభ్యంతరం పెట్టకపోవటం.

 

మొత్తం మీద చంద్రబాబు మీద ఎప్పటి నుండో కడుపులో ఉన్న కోపాన్నంతా అన్నా రాంబాబు అసెంబ్లీలో  తీర్చేసుకున్నట్లే కనబడుతోంది. ఎందుకంటే టిడిపిలో కీలక నేతగా ఉన్న రాంబాబు మీద వైసిపి తరపున గెలిచిన ముత్తముల అశోక్ రెడ్డిని తీసుకొచ్చి మరీ పెట్టారు. దాంతో అప్పటి నుండి చంద్రబాబు పై  రాంబాబు మండిపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అశోక్ పై రాంబాబు ఏకంగా 80 వేల ఓట్ల మెజారిటితో గెలవటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: