చంద్రయాన్ 1 2008 లో ఇండియా చేపట్టిన అతి పెద్ద ప్రయోగం.  ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది.  చంద్రుని ధ్రువ ప్రాంతాల్లో నీటి అన్వేషణను కనుగొనడంలో సఫలం అయ్యింది.  నీటి జాడను కనుగొన్న చంద్రయాన్ 1 రెండేళ్లు పనిచేయాల్సి ఉన్నా వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా కేవలం 10 నెలల్లోనే కాలం చెల్లింది.  


ఇప్పుడు ఇండియా చంద్రయాన్ 2  ప్రయోగం చేయబోతున్నది.  ఈరోజు మధ్యాహ్నం చంద్రయాన్ 2 నింగిలోకి దూసుకుపోబోతున్నది. భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుని మీదకు చంద్రయాన్ 2 వెళ్తుంది.  ధ్రువప్రాంతాల్లో సేఫ్ గా ల్యాండ్ అవుతుంది.  


ఈ చంద్రయాన్ లో ఓ రోవర్ ను కూడా పంపిస్తున్నారు.  ఇది అక్కడి మట్టిని, నీటి ఆనవాళ్లను పరిశోధించి ల్యాండర్ ద్వారా భూమి మీదకు పంపుతుంది.  ఒకవేళ అక్కడి మట్టి కణాల్లో నీటి జాడ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలిస్తే.. భవిష్యత్తులో మనిషి నివసించేందుకు ఆవాసయోగ్యం అయ్యేవిధంగా పరిస్థితులను మలుచుకోవచ్చు.  


ఇప్పటి వరకు అనేక దేశాల చంద్రునిపై ప్రయోగాలు చేసినా అవి చంద్రుని మధ్యరేఖపై మాత్రమే జరిగాయి.  మొదటిసారి ఇండియా చంద్రయాన్ 1 ను ధ్రువప్రాంతాల్లో పరిశోధన చేసి నీటి జాడను కనుక్కుంది.  దీనికి కొనసాగింపుగా చేస్తున్న ప్రయోగం కావడంతో ప్రపంచం దృష్టి యావత్తు ఇప్పుడు దీనిచుట్టూ ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: