జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే పోలీసులను చంపడం కంటే.. అవినీతి చేసే రాజకీయ నేతల్ని చంపాలని ఏకంగా ఉగ్రవాదులకు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సూచించారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద దూమారమే రేగింది. ఆయన ఉగ్రవాదులకు ఈవిధంగా సూచించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయకులను చంపేయడం ఆపేయాలని, ఏళ్ల తరబడి కాశ్మీర్ ను కొల్లగొట్టినోళ్లను టార్గెట్ చేయాలని టెర్రరిస్టులకు సూచించారు.  ‘తుపాకులు పట్టిన ఈ కుర్రోళ్లు.. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, ప్రత్యేక పోలీసు అధికారులైన తమ ప్రజలనే చంపుతున్నరు. వాళ్లనెందుకు చంపుతున్నారు?  చంపాలనుకుంటే కాశ్మీర్ సంపదను లూటీ చేసినోళ్లను టార్గెట్ చెయ్యుండి. అటువంటోళ్లను ఒక్కరినైనా చంపారా?’ అని మాలిక్ ప్రశ్నించారు. ఏదేమైనా తుపాకులు ఎప్పటికీ పరిష్కారం చూపలేవని, ఎల్టీటీఈ నే అందుకు ఎగ్జాంపుల్ అంటూ వాటిని వదిలేయాలని సూచించారు. తుపాకులకు ఇండియన్ సర్కారు ఎన్నటికీ తలవంచదని స్పష్టం చేశారు. హింసాత్మక మార్గాలను వదిలేయాలని టెర్రరిస్టులను కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: