మహర్షి సినిమా నిర్మాణంలో దిల్ రాజు కూడా భాగమని తెలిసిన సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్ అయ్యింది కానీ లాభాలు మాత్రం నిర్మాతలకు రాలేదని వినికిడి. డైరక్టర్ వంశీ పైడిపల్లికి హీరో మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి ఇప్పటికే ఓకే అయింది వ్యవహారం. వంశీ పైడిపల్లికి అడ్వాన్స్ ఇచ్చింది నిర్మాత పివిపి, అందులో నిర్మాత దిల్ రాజ కు కూడా భాగస్వామ్యం వుంది. కానీ మహర్షి సినిమా వ్యవహారం చూసిన తరువాత నిర్మాత దిల్ రాజు, అలాగే పివిపి కూడా సినిమా చేయాలా? వద్దా? అనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.


ఎందుకంటే మహర్షి సినిమా వల్ల అటు దిల్ రాజుకు కానీ, ఇటు పివిపికి కానీ పెద్దగా లాభం ఏమీలేకపోయిందన్నది వారికి, వారి సన్నిహితులకు తెలిసిన వాస్తవం. ముఖ్యంగా పివిపి మహర్షి డీల్ వల్ల కాస్త గట్టిగానే ఇబ్బంది ఎదుర్కొన్నారు. కొంత నష్టపోయారని టాక్. ఓవర్ ఫ్లోస్ వల్ల వచ్చిన లాభాలు ఈ నష్టాలను ఎంతవరకు కవర్ చేసాయన్నది తెలియాల్సివుంది. అలాగే మహేష్ తరువాత సినిమా సరిలేరు నీకెవ్వరుకు కూడా వంద కోట్లకుపైగా ఖర్చు వుంటుందని వినిపిస్తోంది.


ఆ సినిమాకు నాన్ థియేటర్ హక్కులు తన రెమ్యూనిరేషన్ గా మహేష్ బాబు తీసుకుంటున్నారు. కేవలం థియేటర్ హక్కుల మీద లాభాలు తెచ్చుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో దిల్ రాజు వెళ్లి మహేష్ బాబుతో ఓ మాట అన్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అదేమంటే..''... మీరు రెమ్యూనిరేషన్ గా నాన్ థియేటర్ హక్కులు వుంటాయి. డైరక్టర్ కు రెమ్యూనిరేషన్ వుంటుంది. నిర్మాతగా మాకు కూడా ఓ రెమ్యూనిరేషన్ ముందే ఫిక్స్ చేసి, అప్పుడు సినిమా చేస్తే బెటర్ అనిపిస్తోంది..'' అని. అంటే నిర్మాతగా లాభం వుండడంలేదు అని దిల్ రాజు అన్యాపదేశంగా చెప్పారన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: