ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఇపుడు నడుస్తోంది. కొత్త ప్రభుత్వం, తొలి బడ్జెట్, సుదీర్ఘ కాలం పాటు సాగే సమావేశాలు కావడంతో అందరి ద్రుష్టి ఇటువైపే ఉంది. పైగా జగన్, చంద్రబాబు సీట్లు అటూ ఇటూ మార్చుకున్న తరువాత జరుగుతున్న మీట్ ఇది. దాంతో టీవీలకు రాజకీయ ప్రియులు అతుక్కుపోతున్నారు.


ఈ వారంతో అసెంబ్లీ సెషన్స్ అయిపోతున్నాయి. తొలి అసెంబ్లీ, ఇపుడు బడ్జెట్ సెషన్ ఈ రెండూ చూసినపుడు అసెంబ్లీలో ఉత్తమ రికార్డ్ ఎవరిది, చెత్త రికార్డ్ ఎవరిది అన్న చర్చ సహజంగానే వస్తుంది. అసెంబ్లీలో వైసీపీ సర్కార్ కి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పెద్ద అసెట్ గా మారారు. అందులో సందేహం లేదు. ఆయన చక్కని ప్రసంగం, విషయాన్ని విడమరచి చెప్పే తీరు, విపక్షం పైన కూడా హుందాగా విమర్శలు చేయడం జనాలు మెచ్చుకునే తీరులో ఉన్నాయి.



ఇక చెత్తగా ఉన్న ప్రదర్శన మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ది అంటున్నారు. ఆయన లూజ్ టంగ్ ప్రభుత్వానికి డేంజ‌రేనని స్పష్టమవుతోంది. బూతులు కూడా ఆయన సునాయాసంగా చెప్పేస్తున్నారు. ఇది ఇబ్బంది పెట్టేదే. మరో వైపు సీనియర్లు అని చెప్పుకుంటున్న బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీలో తమ ముద్ర వేసుకోలేకపోతున్నారు. మరో వైపు అంబటి రాంబారు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వంటి వారు డీసెంట్ గా సబ్జెక్ట్ మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని కట్టడి చేస్తున్నారు.


బాబు వైపు చూసుకుంటే అచ్చెన్నాయుడు పెద్ద మైనస్ అయ్యారని అంటున్నారు. ఆయన సైతం లూజ్ టంగ్ తో అభాస్ కావడమే కాకుండా సభలో హుందా తనాన్ని దెబ్బతీస్తున్నారని అంటున్నారు. అలాగే నిమ్మల రామానాయుడు కూడా  ఉంటున్నారని అంటున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి హుందాగా మాట్లాడుతూ విపక్షానికి హుందాతనాన్ని తెస్తున్నారన్నది మేధావుల మాట. మొత్తానికి సభలో కొత్త సభ్యులెవరూ నోరు విప్పకపోవడం దారుణమే.


మరింత సమాచారం తెలుసుకోండి: