మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన నష్టం కంటే రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టం అపారం అని చెప్పాలి.  మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పెద్దగా ఆయుధ సామాగ్రి లేదు.  ప్రత్యేకంగా తలపడింది ఎక్కువ.  అందుకే సైన్యం నష్టం కూడా తక్కువే.  


కానీ, రెండు ప్రపంచ యుద్ధం జరిగే నాటికి ప్రతి దేశం సొంతంగా మారణాయుధాలను సమకూర్చుకుంది.  యుద్ధ నౌకలు, భారీ వినాశనాన్ని సృష్టించే ఆయుధాలను సమకూర్చుకుంది.  దీంతో ఆ సమయంలో సమయంలో జరిగిన యుద్ధంలో అపారమైన నష్టం సంభవించింది.  


ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన ఈగిల్ 56 అనే నౌక అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది.  దీని జాడకోసం ఎన్నో ఏళ్లుగా అన్వేషణ చేస్తున్నారు.  ఎట్టకేలకు ఇటీవలే దీనిని కనుగొన్నారు.  ఈగిల్ యుద్ధనౌకలోని బాయిలర్ పేలడం వలన నౌక మునిగిపోయిందని అనుకున్నారు.  


కానీ, కొంతమంది కథనం ప్రకారం ఈ నౌకకు దగ్గరిలో జర్మనీకి చెందిన జలాంతర్గామిని చూశామని దాని కారణంగానే నౌక మునిగిందని కొందరి అభిప్రాయం.  ఏది ఏమైనా 79 సంవత్సరాల తరువాత మునిగిపోయిన నౌకను కనుగొనడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: