132 గ్రామాల్లో ఒక్క ఆడబిడ్డ పుట్టలేదు... !!
ఇది దేశ ప్రజలు గమనించాల్సిన అరుదైన వాస్తవం. మన భవిష్యత్‌ చిత్రపటంలో జరిగే ప్రమాదాన్ని వివరించే సత్యం. గత మూడు నెలల్లో 132 గ్రామాల్లో 216 ప్రసవాలు జరిగితే, ఒక్క ఆడబిడ్డ కూడా లేదు వారిలో..! ఇది నమ్మలేని నిజం.

ఒక జిల్లాలోని 132 గ్రామాల్లో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదు. సాక్షాత్తూ అధికారుల చెప్పిన లెక్కలనే 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' వార్తా కథనంగా రాసి దేశ ప్రజలకు షాక్‌ ఇచ్చింది. ఇదంతా, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో జరుగుతున్న ఘోరం !! స్కానింగు రిపోర్టులపై, అబార్షన్లపై నిషేధం ఉన్నప్పటికీ , జరుగుతున్న అసలు వాస్తవం ఇది.
పుట్టకముందే తల్లుల కడుపుల్లోనే కడతేరుస్తున్నారా..? లేదా అనేది విచారణలో కానీ బయట పడదు.
'ఈ పల్లెలను రెడ్‌ జోన్‌గా ప్రకటించి, ఆరు నెలలు పరిశీలిస్తాం. పరిస్థితి మారకపోతే ఆశ హెల్త్‌ వర్కర్ల పై సీరియస్‌ చర్యలుంటాయి, అనుమానాస్పద అబార్షన్లపై నిఘా వేసి, పసిగట్టి రిపోర్టు చేయాలి. నిజమని తేలితే ఆ తల్లిదండ్రులపైనా కేసులు పెడతాం, అంటున్నాడు ఆ జిల్లా పాలనాధికారి.

' మా ఏరియాలో భ్రూణహత్యలు ఉండవ్‌, కానీ ఎందుకిలా జరుగుతున్నది..? అంతుపట్టడం లేదు. స్వచ్చందసంస్థలు, సామాజికవేత్తలతో ఆడశిశువుల్ని కాపాడుకుందాం అనే ప్రచారం నిర్వహిస్తాం...' అని స్ధానిక నాయకులు అంటున్నారు. ఏదేమైనా ఈ వార్త సోషల్‌ మీడియాలో తీవ్రసంచలనం సృష్టిస్తుంది. ఇలాంటి పరిస్ధితిపై దేశమంతా సర్వే చేయాల్సిన అవసరం ఉంది.

' ఇది అతి తీవ్రమైన సామాజిక సమస్య. దీనిపై ఇప్పటి వరకు ప్రధాన మంత్రి ,కేంద్రమంత్రులు ఎవరూ స్సందించక పోవడం బాధ్యతా రాహిత్యం..' అని సోషల్‌ ప్లాట్‌ ఫారంల పై బుద్ధిజీవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: