టీడీపీ పార్టీ నుంచి వైసీపీలోకి ఎప్పుడెప్పుడు జంప్ అవ్వాలా అని చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఫైర్‌బ్రాండ్ టిడిపి నాయకుడు, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా త్వరలో టిడిపికి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. డీపీ లో బలమైన గళాన్ని వినిపించి రాజకీయంగా సంచలనాలు సృష్టించారు బొండా ఉమా. వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కూడా ఆయన కేర్ ఆఫ్ అడ్రెస్ అని చెప్పొచ్చు.


ఇక భూకబ్జాల విషయంలో ప్రధానంగా వార్తల్లో నిలిచారు ఉమా. 2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవిని ఆశించారు. అయితే అప్పట్లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో కినుక వహించారు. అయితే చంద్రబాబు ఆయనకు అడగకుండానే టీటీడీ బోర్డులో సభ్యుడిగా పదవిని అప్పగించారు. దీంతో కొంత ఉపశమనం పొందారు.


ఇక తాజా ఎన్నికల్లో ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసినా.. అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో అంటే 15 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి పాలయ్యారు. మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు బొండా ఉమా .. ఇక టీడీపీ లో ఉంటె తిప్పలు తప్పవు అని భావిస్తున్న బొండా ఉమా పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: