1999 లో ఇండియా.. పాక్ ల మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది.  ఇండియా బోర్డర్ లోని కార్గిల్ లోని టైగర్ హిల్స్ ను పాక్ సైన్యం అక్రమంగా ఆక్రమించుకోవడంతో యుద్ధం మొదలైంది.  ఈ యుద్ధంలో ఇండియా సైనికులు వీరోచితంగా పోరాటం చేసి తిరిగి కార్గిల్ ను స్వాధీనం చేసుకున్నారు.  


ఈ యుద్ధంలో భారతీయ సైనికులతో పాటు పాక్ కు చెందిన ఓ వీరుడి గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి.  ఆయనే కల్నల్ షేర్ ఖాన్.  టైగర్ హిల్స్ లో భారత సైనికులతో చేసిన పోరాటం మర్చిపోలేనిది.  సైనికులు అంతా మాములు పాక్ డ్రెస్ లలో ఉంటె.. షేర్ ఖాన్ మాత్రం సైనిక దుస్తుల్లోనే ఉన్నాడు.  


సైనికులకు ముందుండి పోరాటం చేశాడు.  మరణిస్తున్నామని తెలిసినా ఏ మాత్రం భయపడకుండా ఆయన చూపిన తెగువ భారతీయ సైనికులను అబ్బురపరిచింది. హిల్స్ పై 56 మంది పాక్ సైనికులను సైన్యం ఖననం చేసింది.  కానీ, కల్నన్ షేర్ ఖాన్ ను మాత్రం కిందికి తీసుకొచ్చి.. పాక్ కు అప్పగించింది.  


పాక్ కు అప్పగించే ముందు అతని జేబులో షేర్ ఖాన్ వీరోచిత పోరాటం గురించి చీటీ రాసిపెట్టి అప్పగించారు.  అయన వీరోచిత పోరాటాన్ని ఇండియా గుర్తించడంతో ఆయనకు పాక్ ప్రభుత్వం నిషాన్ ఏ హైదర్ పురస్కారం అందించింది.  ఇది పరమవీర చక్ర పురస్కారంతో సమానం.


మరింత సమాచారం తెలుసుకోండి: