చెన్నైలో ను వేళ్ళూరూ లో మళ్లీ ధనప్రవాహం ఎటు చూసినా నోట్ల కట్టలు ఏరులై పారుతున్నాయి. ఎన్నికల అధికారులకు నోట్ల కట్టలు భారీగా పట్టుబడుతున్నాయి. అధిక ధనప్రవాహం కారణంగానే గతంలో వేళ్ళూరూ లోక్ సభ స్థానంలో పోలింగ్ రద్దు చేశారు. మళ్లీ పోలింగ్ కు రంగం సిద్ధమౌతున్న తరుణంలోనూ భారీగా పట్టుబడుతోంది. 

వెల్లూరు లోక్ సభ స్థానాని కి ఆగస్టు ఐదున పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారుల తనికీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గుడియాత్తం సమీపంలో ఓ మినీ వ్యాన్ లో యాభై ఆరు లక్షలు నగదును తరలిస్తూండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న డబ్బును స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ డబ్బు ఎవరిది మినీ వ్యాన్ లో ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఏప్రెల్ లో‌ ఎన్నికల అధికారుల డాదులలో డిఎంకె నాయకుడి సహచరుడి నుంచి కనీసం రూ .12 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వెల్లూరులో ఓటింగ్‌ను రద్దు చేయాలని ఎన్నికల సంఘం చేసిన విజ్ఞప్తిని  అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ అంగీకరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: