ఏపీలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం నమోదు చేయగా టీడీపి ప్రతిపక్షానికి పరిమితమైంది. జగన్ సర్కారు ఏర్పడి ఆయన ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశాక ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కోసం ఒకసారి అసెంబ్లీ సమావేశాల జరిగాయి ఇప్పుడు ఏపీ బడ్జెట్ రూపంలో రెండోసారి అసెంబ్లీ సమావేశా లు జరుగుతున్నాయి.సిఎం హోదాల్లో జగన్ ప్రతి పక్ష నేత హోదాలో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు.

వర్షాకాలం కారణంగా వాతావరణం బయట కూల్ గా ఉన్న ఏపీ అసెంబ్లీ పాత్రం ప్రతీ రోజూ హీట్ పుట్టిస్తోంది. అధికార, ప్రతి పక్ష ఎమ్మెల్యేల మాటల యుద్దానికి అసెంబ్లీ వేదికవుతోంది ఇంత హడావుడి లో కూడా ఒక  టీడీపి ఎమ్మెల్యే  మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్ట కుండా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు గైహాజరు అవుతూ వార్తల్లోకెక్కిన ఆ వ్యక్తి ఎవరో కాదు టిడిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.

 గంటా శ్రీనివాస్ రావ్ కంటే తొక్కువ సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది ప్రతీరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ తమకు వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గంటా మాత్రం మొదటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం లేదు. కనీసం చంద్రబాబు వైపునుంచైనా ఆదేశాలు ఉంటాయనుకుంటే అదీలేదు. చంద్రబాబు కూడా గంటా గైహాజరుపై మౌనం వహించారు. దీంతో అతి కీలకమైన అసెంబ్లీ సమావేశాల కు గంటా గైహాజరు హాజరవుతున్నార ని అంశం టీడీపీ లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో సైతం చర్చనీయాంశమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: