ఈ నెల 15వ తేదీన జాబిలమ్మ వద్దకు  చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టాలని ఇస్రో అధికారులు సిద్దమైనప్పటికీ.. క్రయోజనిక్ ట్యాంకర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల రీత్యా వాయిదాపడిన సంగతి తెలిసిందే.ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈరోజు చేపడుతోంది. ఈ మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను తీసుకుని జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ నింగికి ఎగరనుంది.

చంద్రయాన్ 2 ప్రయోగాన్ని కళ్లారా వీక్షించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థులకు ఇలాంటి ప్రయోగాలపై పూర్తి అవగాహన వచ్చేలా చేయాలని గొప్ప ఆలోచనతో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.   రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ప్రసార మాధ్యమాల ద్వారా చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చూపించాలని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అధికారులను ఆదేశించారు.

విద్యార్థులు ప్రయోగాన్ని వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేశ్‌ ఆదేశించారు.  ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వర్చువల్ తరగతులు, టీవీ, డిజిటల్ తరగతులు లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చంద్రయాన్ ప్రయోగాన్ని విద్యార్థులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: