పార్టీ ఏదైనా కీలక పదవులు వరించిన తీరు గంటాకు ఉత్తరాంధ్ర లోనే ఎల్ఫ్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తాయి.  టీడీపి నించి రాజకీయ అరంగేట్రం చేసిన గంటా శ్రీనివాస్ 1999 ఎన్నికల్లో మొదటిసారి అనకాపల్లి ఎంపీ గా పోటీ చేసి పార్లమెంటు లో అడుగు పెట్టారు. 2004 ఇదే టిడిపి నుంచి చోడవరం ఎమ్మెల్యే గా 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో తెరపైకొచ్చిన సమయాల్లో గంటా శ్రీనివాస్ ప్రజారాజ్యం నుంచి అనకాపల్లి   ఎమ్మెల్యే అయ్యారు.


చిరంజీవి కి అత్యంత సన్నిహితుడు గా పేరున్న గంటాకు పీఆర్పీ ని కాంగ్రెస్ లో విలీనం చేశాక కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కింది. 2014 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీ లో చేరిన గంట మరోసారి ఎమ్మెల్యే ఎ చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టారు. ఇక మొన్నటి ఎన్నికల్లో గంటా నార్త్  వైజాగ్  ఎమ్మెల్యే అయ్యారు గెలిచిన తరువాత ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి అసెంబ్లీ రావడం తప్పించ్చి తరువాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు గంటా గైహాజరు హాజరవుతున్నరు.


  గంటా అసెంబ్లీ గైహాజరుపై మొదట్లో మీడియో ప్రశ్నించినప్పుడు తన మనవడి పుట్టిన రోజని అందుకే రాలేదని వ్యాఖ్యలు చేయడం కూడా అప్పట్లో చర్చాంశం అయ్యాయి.  ఆ తరువాత సమావేశాలు కూడా  రాకపోవటానికి పలు కారణాలే ఉన్నాయంటన్నారు ఆందులో మొదటి కారణం తాను వైసీపీ లోకి వెళతారని ప్రచారం జరగడం అంటున్నారు. గంటా స్వయంగా తాను వైసిపి లోకి వెళ్ళే ప్రసక్తి లేదని చంద్రబాబుకు అండగా ఉంటానని ప్రకటించినా ఆయనపై ఈ ప్రచారం ఆగటం లేదు. సొంత పార్టీ నేతలే తన పై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించిన గంట కావాలనే అసెంబ్లీ సమావేశాల గైహాజరు అవుతున్నారని వార్త. 


గంట  అసెంబ్లీ రాకపోవటానికి మరో ముఖ్య కారణం ఒకప్పటి ఆయన ఆనుచరుడు గా పేరున్న అవంతి శ్రీనివాస్. గంటా అనుచరుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన అవంతి శ్రీనివాస్ గంటాతో పాటే తాను కూడా పలు పార్టీల తిరుగుతూ వచ్చారు. ఏపీ విడిపోయాక జరిగిన ఎన్నికల్లో  అవంతి శ్రీనివాస్ టీడీపీ  అనకాపల్లి ఎంపీ గా ఎన్నికయ్యారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భీమిలి సీటు విషయం లో ఇద్దరి విబేదాలు తెరమీదకు వచ్చాయి. తన స్నేహితుడి  కోసం తాను భీమిలి సీటు త్యాగం చేస్తానని గంటా ప్రకటించిన అవంతి మాత్రం పైసీపి ఆపరేషన్ ఆకర్ష్ క్రమంలో పార్టీ కండువ కప్పుకుని మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలవడమే కాదు ప్రస్తుతం జగన్ కేబినెట్ లో అవంతి మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు తన అనుచరుడు మంత్రి గా ఉంటే తాను ఎమ్మెల్యే గా అసెంబ్లీ లో అడుగుపెట్టడం ఇబ్బంది కాబట్టి గంటా అసెంబ్లీ కి దూరంగా ఉంటున్నారని వార్తలొస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: