పెట్టుబడులను ఆకర్షించటమే టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం. చంద్రబాబునాయుడు హయాంలో ఏర్పాటైన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును రద్దు చేయబోతున్నట్లు సమాచారం. పాత బోర్డను రద్దు చేసిన తర్వాత తొందరలో ఏపి ఐపిఎంఏ అనే బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

 

నిజానికి చంద్రబాబు హయాంలో ఏర్పాటైన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు వల్ల ఖర్చులే తప్ప ఉపయోగం ఏమాత్రం కనబడలేదు. ఈ బోర్డు ఆధ్వర్యంలోనే నాలుగు సంవత్సరాల పాటు వరుసగా పెట్టుబడుల ప్రోత్సాహక సదస్సులు జరిగాయి. సదస్సుల నిర్వహణకే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

 

ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన నాలుగు సదస్సుల్లో కలిపి వెయ్యి కోట్ల రూపాయలు కూడా పెట్టుబుడులు రాలేదు.  వాస్తవాలు ఇలాగుండగా మొత్తం రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు చంద్రబాబు  భలే బిల్డప్ ఇచ్చారు. పచ్చ మీడియా కూడా విపరీతమైన హైప్ ఇచ్చింది. టిడిపి కార్యకర్తలకే సూటు, బూట్లు వేసి ఎంవోయులు కుదుర్చుకున్న విషయం బయటపడటంతో ప్రభుత్వ పరువు పోయింది.

 

తెల్ల ఏనుగు లాగ తయారైన ఈ బోర్డును రద్దు చేసి జగన్ తొందరలో ఏపి ఇన్వెస్ట మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ యాక్ట్ (ఏపి ఐపిఎంఏ)ను తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు.  పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్ రోజా అంతా కలిసి  దీని ద్వారా జగన్ ఏ మేరకు పెట్టుబడులు తీసుకువస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: