సిద్దిపేట,  చింతమడక ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నతువంటి రోజు వచ్చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం ఈ గ్రామస్తులు దాదాపు వెయ్యి కళ్ళతో ఎదురు చుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఊరంతా ఒక పండగ వాతావరణం దసరా, దీపావలి, ఉగాది పండగ  ఒకేసారి వస్తే ఎంత ఆనందం ఉంటుందో ఇవాళ చింతమడక గ్రామంలో కూడా అట్లాంటి ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది.

ప్రతి ఇంటికి కూడా మంగళ తోరణాలు కట్టి  పూలు కట్టి ఇంటి ముందు ముగ్గులతో కేసీఆర్ వెల్కం అంటూ ముగ్గులు వేసి ఆహ్వానం పలకడానికి  ప్రజలు సిద్ధంగా ఉన్నట్టి పరిస్థితి మనకు చింతమడకలో నెలకొంది. గత వారం పది రోజులు అధికారులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇంటింటికి వెళ్లి గ్రామస్థులకు సంబంధించిన ఆర్థిక సామాజిక సర్వే నిర్వహించి వాళ్ళకు సంబంధించిన ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. 

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్  అడిగిన సర్వేలకు ఆయన ఎట్లాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ప్రజలకు ఎలాంటి  అవసరాలు తీర్చాలన్న విషయమ్మీద ఇప్పటికే ఎనిమిది వందల యాభై కుటుంబాలకు సంభందించిన సర్వేలనూ అధికారులు పూర్తి చేశారు. వ్యక్తిగత అవసరాలకు  సంభందించి  గ్రామంల్లో సంబంధించిన సామూహిక అవసరాల లెక్కలు  అటు రోడ్డు కావచ్చు వ్యవసాయం కావచ్చు విద్య వైద్య సంబంధించిన విషయాల కావచ్చు,  అన్ని రంగాలల్లో కూడా పూర్తి స్థాయి లో ఇక్కడ సర్వే నిర్వహించి ప్రతిపాదనలనూ ముఖ్యమత్రి కేసీఆర్ కి అందిస్తున్నారు. 

ఇటీవలే అటు అధికారులతో స్థానిక ఎమ్మెల్యే టి. హరీశ్ రావు గారితో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ కుటుంబాలకు పూర్తి స్థాయి లో ఒక పది లక్షలు,  పన్నెండు లక్షల రూపాయల మేర ఆర్థిక సాయమంటే ఉపాధి అందే విధంగా ప్రతి కుటుంబమూ తమంత తాముగా బ్రతికే విధంగా ఒక ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకీ ఆవసరాలు తీర్చే విధంగా  అన్ని ప్రతిపాదనలను సిద్దం చేయాలని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: